Site icon NTV Telugu

Narayanpet Murder Case: భర్తను చంపి సినిమాటిక్‌ డ్రామా క్రియేట్ చేసిన భార్య.. చిన్న క్లూతో..

Hyderabad

Hyderabad

ప్రియుడితో మాట్లాడొద్దని హెచ్చరించినందుకు ఏకంగా భర్తను హతమార్చిందో భార్యామణి !! మద్యం మత్తులో ఉన్న భర్తను గొంతునులిమి చంపడమే కాకుండా… ఆత్మహత్యగా చిత్రీకరించింది !! బంధువులనూ నమ్మించి.. అంత్యక్రియలకు ఏర్పాటు చేసింది. ఒక్క చిన్న క్లూ.. భార్య ఆడిన నాటకాన్ని బయటపెట్టింది !! ఇంతకూ ఎవరా కిరాతక భార్యామణి..? ప్రియురాలి డ్రామా వెనకున్న ప్రియుడు ఎవరు..?

READ MORE: Viral Video: ట్రెండింగ్‌లో పాకిస్థానీ మహిళ వీడియో.. అందులో ఏముందంటే..?

భర్త అంటే.. భరించేవాడంటారు !! ఇదంతా గతం !! భర్త అంటే భార్య చేతిలో బలయ్యేవాడు.. !! ఇదే నేటి ట్రెండ్‌. కూరగాయలు తరిగినంత ఈజీగా భర్తలను చంపేస్తున్నారు భార్యలు. అది కూడా క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌లను మించే రీతిలో మర్డర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అంతా చేసి తమకేం తెలియదన్నట్లుగా మహానటిని తలదన్నేలా నటిస్తున్నారు. తాజాగా… మరో భార్యామణి ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చింది. ఆత్మహత్యగా నమ్మించి.. సినిమాటిక్‌ డ్రామా అల్లింది. కథ అడ్డం తిరిగి.. పోలీసులకు దొరికిపోయింది.

READ MORE: 100: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆర్కే సాగర్ ‘ది 100’ ట్రైలర్‌ లాంచ్

నారాయణపేట జిల్లా పరిధిలోని కోటకొండకు చెందిన కంపిలి అంజిలప్పకు పదేళ్ల క్రితం ధన్వాడ మండలం రాంకిష్టయ్యపల్లికి చెందిన రాధతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు కోసం 2 నెలల క్రితం ముంబైకి వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారు. ముంబైలోనే పనిచేస్తున్న ధన్వాడకు చెందిన ఓ యువకుడితో రాధకు పరిచయం ఉండేది. పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వయసులో తనకంటే చిన్నవాడైనా… అతడితో ప్రేమాయణం సాగించింది రాధ. విషయం తెలుసుకున్న భర్త.. భార్య రాధను మందలించాడు. అయినా తీరు మారలేదు. పనులు మాని ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది..

READ MORE: Nidhi Agarwal : నిధి అగర్వాల్ ను ‘వీరమల్లు’ కాపాడుతాడా..?

భార్య తీరుతో విసుగెత్తిన అంజిలప్ప… అక్కడి నుంచి తట్టాబుట్టా సర్ధేసి… సొంతూరికి బయల్దేరాడు. తీరా ముంబై నుంచి తాండూరు వరకు చేరుకోగానే… కొత్త డ్రామా మొదలుపెట్టింది రాధ. ముంబై వచ్చిన రెండు నెలలు కూడా కాకముందే ఊరికి తిరిగెళ్లిపోతే… పని చేయడం చేతకాలేదని నలుగురూ నాలుగు మాటలంటారని… ఊరికి కాకుండా మరెక్కడికైనా వెళ్లిపోదామని భర్తకు చెప్పింది. దీంతో… అంజిలప్ప రూటు హైదరాబాద్‌ వైపు మళ్లింది. బాచుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ లో వాచ్‌మెన్‌ గా పనిలో చేరారు. స్థానికంగా ఉండే లేబర్‌ అడ్డాలో గుడిసె వేసుకుని ఉంటున్నారు.

READ MORE: Tholi Ekadashi 2025: తొలి ఏకాదశి నాడు దయచేసి ఈ పనులు మాత్రం చేయకండి

ఊరు మారింది… చేసే పని మారింది… కానీ రాధ తీరు మారలేదు. ముంబైలో ఉన్న ప్రియుడితో నిత్యం కాల్స్‌ మాట్లాడటం మొదలుపెట్టింది రాధ. భర్త అంజిలప్ప గమనించాడు. మరోసారి రాధను హెచ్చరించాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్యా పలుమార్లు గొడవ జరిగింది. దీంతో… రాధ ఏకంగా భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. భర్త హత్యకు స్కెచ్‌ వేసింది. గతనెల 23న మద్యం సేవించి ఇంటికి వచ్చాడు అంజిలప్ప. ఇదే అదునుగా భావించిన రాధ… ఆ రాత్రే భర్తను హతమార్చాలనుకుంది. మద్యం మత్తులో గాడ నిధ్రలో ఉన్న అంజిలప్ప గొంతునులిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది రాధ. భర్త చనిపోయాడు అని నిర్ధారించుకుని.. తనకేం తెలియనట్లు పక్కనే ఉన్న గుడిసెలో వెళ్లి పడుకుంది. తన భర్త తనను తీవ్రంగా కొట్టాడని.. అందుకే ఈ రాత్రి మీ గుడిసెలో పడుకుంటానని చెప్పింది. పక్క గుడిసెలో వాళ్లు కూడా… నిత్యం ఇద్దరి మధ్య జరిగే గొడవనే కాదా అని లైట్‌ తీసుకున్నారు..

READ MORE: Devendra Fadnavis: మరాఠీ కాదు, వారి బాధ రాజకీయం గురించి.. ఠాక్రే సోదరులపై ఫడ్నవీస్ ఫైర్..

తెల్లారగానే తన గుడిసెలోకి వెళ్లిన రాధ… కొత్త డ్రామా అల్లింది. తన భర్త ఉలుకుపలుకు లేకుండా పడి ఉన్నాడని గగ్గోలు పెట్టింది. స్థానికులు వచ్చి చూడగా… అంజిలప్ప చనిపోయాడని నిర్థారించారు. దీంతో.. ప్రైవేట్‌ అంబులెన్స్‌ తీసుకుని సొంతూరైన కోటకొండకు అంజిలప్ప మృతదేహం తీసుకుని వచ్చింది రాధ. తనతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నాడని అంజిలప్ప కుటుంబసభ్యులను నమ్మించింది రాధ. అంత్యక్రియలకు కూడా ఏర్పాటు చేశారు కుటుంబసభ్యులు. కానీ.. అంజిలప్ప తమ్ముడికి వదిన తీరుపై అనుమానం వచ్చింది. అంజిలప్ప మృతదేహాన్ని పరిశీలించగా… గొంతుమీద గాయాలు గుర్తించాడు. వెంటనే నారాయణపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోటకొండ చేరుకున్న పోలీసులు… మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

READ MORE: Hypersonic missiles: ‘‘ప్రాజెక్ట్ విష్ణు’’తో పాక్, చైనాలో వణుకు.. 12 రకాల హైపర్ సోనిక్ క్షిపణుల్ని రెడీ చేస్తున్న భారత్..

జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి… బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు సేకరించిన బాచుపల్లి పోలీసులు… రాధను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తానే భర్తను గొంతునులిమి హత్య చేశానని ఒప్పుకుంది రాధ. హత్యకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు పోలీసులు. రాధపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. తండ్రి హత్యకు గురయ్యాడు. తల్లి జైలు పాలైంది. దీంతో.. రాధ ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. ఇద్దరు పిల్లలను అమ్మమ్మకు అప్పగించారు పోలీసులు. భర్తను చంపితే నేరస్తురాలవుతుందనే చిన్న లాజిక్‌ను మర్చిపోయి.. ఇద్దరు పిల్లలను అనాథను చేసింది రాధ. అంతేకాదు.. పచ్చని తన కాపురంలో తనే నిప్పులు పోసుకుంది.

Exit mobile version