NTV Telugu Site icon

Meerut Murder: భార్య గొంతు కోసింది, లవర్ తల నరికాడు.. మీరట్ హత్యలో భయంకర నిజాలు..

Meter Murder..

Meter Murder..

Meerut Murder: మీరట్ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ దారుణహత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న సౌరభ్, తన కుమార్తె బర్త్‌ డే కోసం ఇండియాకు తిరిగి వచ్చిన సమయంలో, భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్ శుక్లాలు కలిసి కత్తితో దాడి చేసి హతమార్చారు. శరీరాన్ని ముక్కులుగా చేసి డ్రమ్ములో వేసి, సిమెంట్‌తో కప్పేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. డ్రగ్స్ బానిసలుగా మారిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.

Read Also: Robinhood: డేవిడ్ వార్నర్ పై షాకింగ్ కామెంట్స్.. బహిరంగ క్షమాపణలు చెప్పిన నటుడు రాజేంద్రప్రసాద్

ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేరం జరగడానికి 8 రోజుల ముందు ప్రధాన నిందితురాలైన భార్య ముస్కాన్ రూ. 800కు రెండు కత్తులు కొనుగోలు చేసి, అనేక సార్లు ఎలా పొడవాలో రిహార్సల్ చేసిందని పోలీసులు కనుగొన్నారు. ముస్కాన్ కత్తితో చంపేయడంపై అనుమానం రావడంతో, గొంతు కోసే రేజర్‌ని కొనుగోలు చేసింది. సౌరభ్ తలను శరీరం నుంచి వేరు చేయడానికి ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.

మార్చి 3 రాత్రి నిద్రమాత్రలు ఇచ్చిన తర్వాత, కత్తితో మూడుసార్లు పొడిచి, గొంతు కోసి ముస్కాన్ హత్య చేసింది. సాహిల్ తలని మొండం నుంచి వేరు చేశాడు. దీని కోసం అతను కత్తిని ఉపయోగించినట్లు తెలిసింది. ఆ తర్వాత ఇద్దరూ శరీరాన్ని 15 ముక్కలుగా నరికేసింది, డ్రమ్‌లో వేసి, సిమెంట్‌తో కప్పేశారు. ముందుగా శరీరాన్ని డ్రమ్‌లో వేసి, మట్టి పోసి మొక్కల్ని నాటడమే ప్రధాన ఉద్దేశంగా ముందుగా ఉంది. అయితే, దుర్వాసన వస్తుందని తెలుసుకుని, డ్రమ్‌ని సిమెంట్‌తో నింపేశారు. డ్రమ్ బరువును ఇద్దరూ అంచనా వేయలేకపోయారు. దానిని పారవేయడానికి కార్మికులను పిలిచినప్పటికీ వారు దానిని ఎత్తలేకపోయారు. ముస్కాన్ భయపడి తన తల్లిదండ్రుల వద్ద హత్య గురించి చెప్పింది.