NTV Telugu Site icon

Wife Planned to Kill Husband: భార్యామణి నిర్వాకం.. భర్త అడ్డు తొలగించే ప్లాన్

Download (1)

Download (1)

మానవ సంబంధాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తమ సుఖం కోసం డబ్బుకోసం ఏ పని చేయడానికైనా వెనుకాడడం లేదు. భార్య అడ్డు తొలగించుకోవడానికి భర్త, భర్తను చంపేందుకు భార్య కుటిల ప్లాన్ లు వేస్తున్నారు. నా భర్త మనకు అడ్డుగా వున్నాడు. అతడిని చంపేస్తే మనం హాయిగా బతక వచ్చని ఓ భార్యామణి ప్లానేసింది. గుర్తు తెలియకుండా చంపేసి నా దగ్గరికి రా.. ఇద్దరం కలిసి హాయిగా జీవిస్తాం.. అంటూ ప్రియుడికి ఒక భార్య నూరి పోసింది. తన కంటే వయసులో చాలా చిన్నవాడైన ప్రియుడిని రెచ్చగొట్టి భర్తను చంపించింది. భర్తను చంపిన తర్వాత ఏమీ తెలియనట్టు నాటకలాడింది. ఈ వ్యవహారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో సంచలనం కలిగించింది.

వివాహేతర సంబంధాలు ఎలాంటి అకృత్యాలకైనా దారితీస్తాయి. ఓ పండ్ల వ్యాపారి హత్య కేసులోనూ ప్రధాన సూత్రధారి మృతుని అతని భార్య, ఆమె ప్రియుడేనని తేలింది. కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన శంకరయ్య(43), జయసుధ(38) దంపతులు 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. పటాన్‌చెరు సమీపంలోని బీరంగూడకు వచ్చి పండ్ల దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. శంకరయ్య ఏడాది క్రితం శంకర్‌పల్లి మండలం టంగటూర్‌లో దానిమ్మ తోట లీజు తీసుకుని, అక్కడికి వారానికోసారి వచ్చి పోతున్నాడు. బీరంగూడలోని పండ్ల దుకాణంలో ఉండే భార్య జయసుధకు సమీపంలో ఉండే జిమ్ ట్రైనర్‌ తిరుపతిరావుతో పరిచయం కలిగింది.

Rahul Gandhi: మళ్లీ గబ్బర్‌సింగ్ స్ట్రైక్ అంటూ జీఎస్టీ రేట్ల పెంపుపై ఫైర్

భర్త దగ్గర లేకపోవడంతో అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త శంకరయ్య నిత్యం మద్యం తాగి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అతణ్ని చంపేస్తే.. మనమిద్దరం సంతోషంగా ఉండొచ్చని తిరుపతిరావుకి చెప్పింది. ఇద్దరు కలిసి శంకరయ్య హత్యకు వారిద్దరూ కలిసి కుట్రపన్నారు. శంకరయ్యను చంపేసి అది దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించాలని ప్లానేశారు. ఈనెల 11న శంకరయ్య తోటకు ఒంటరిగా వెళ్తున్నాడని వీడికి జయసుధ సమాచారం ఇచ్చింది. శంకరయ్య తోటని చూసుకుని తిరిగి వస్తుండగా టంగటూర్‌ గ్రామ శివారులో ప్రియుడు ఏకకాలంలో దాడికి పాల్పడ్డాడు.అతని తల మెడ భాగాన్ని కోసి అక్కడి నుంచి పారిపోయాడు. తలపై కట్టెతో కొట్టి, కత్తితో గొంతు కోసేశాడు. పోలీసులు కూడా ఇది దోపిడీ దొంగల పనిగా భావించారు. కానీ ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసుని ఛేదించారు. నిందితుడు వాడిన ద్విచక్రవాహనం నంబర్‌ ఆధారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. తిరుపతిరావు స్వస్థలం విజయనగరం జిల్లా పచ్చిపెంట మండలం పంచాలి గ్రామంగా గుర్తించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో చంపించినట్లు వెల్లడించారు. నిందితులను రిమాండ్‌ కు తరలించారు.