రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. మరొకరితో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు కొందరు భార్యలు, భర్తలు. మహిళలు మాత్రం వాళ్ల ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేయించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న వ్యక్తి.. అతని స్నేహితుడితో కలసి ఆమె భర్తపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లి సుమిత్రానగర్‌లో నివాసం ఉంటున్న..భూపాల్ అనే వ్యక్తిపై.. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న దుర్గయ్య అనే వ్యక్తి హత్య చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. . మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగాయిపల్లి గ్రామానికి చెందిన దేశబోయిన భూపాల్‌తో కామారెడ్డికి చెందిన చంద్రకళ(23)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరు కూకట్‌పల్లి సుమిత్రానగర్‌లో నివాసం ఉంటున్నారు. అతడు ప్లంబర్‌గా.. ఆమె ఇళ్లల్లో పని చేస్తున్నారు. చంద్రకళకు తన గ్రామానికి చెందిన దుర్గయ్య(26)తో పెళ్లికి ముందు నుంచే వివాహేతర సంబంధం ఉంది. అవివాహితుడైన దుర్గయ్యను సైతం పక్క వీధిలోని అద్దె ఇంట్లో ఉంచింది. తరచూ వీరిద్దరు కలుసుకునేవారు. వీరి వ్యవహారం తెలిసిన భూపాల్ పలుమార్లు భార్యను హెచ్చరించాడు. దీంతో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
మంగళవారం ఉదయం చంద్రకళ ఇళ్లల్లో పనిచేయడానికి వెళ్లగా.. భూపాల్ ఇంట్లో ఉన్నాడు. ముఖానికి మాస్కులు ధరించిన దుర్గయ్య, అతని స్నేహితుడు భరత్‌రెడ్డి ఇంట్లోకి వచ్చి అతడిపై ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. అతడి మర్మాంగంపై తొక్కడంతో పాటుగా.. అతని మెడను కాళ్లతో తొక్కి చంపేందుకు ప్రయత్నించారు. బాధితుడు అరవడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు తనపై దాడిచేసి చంపేందుకు ప్రయత్నించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంద్రకళతో పాటు మిగతా ఇద్దరు నిందితులపై నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
