Site icon NTV Telugu

Crime: 18 ఎకరాల కోసం పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే భర్తను చంపిన భార్య..

Crime

Crime

Crime: 45 ఏళ్ల వయసు ఉన్న పెళ్లి కాని వ్యక్తి, తనకు 18 ఎకరాలు ఉందని అయినా వధువు దొరకలేదని తన బాధను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య మహరాజ్‌కు చెప్పుకోవడం అతడి చావుకు కారణమైంది. మధ్యప్రదేశ్ జబల్‌పూర్ జిల్లాలోని పదర్వార్ (ఖిటోలా) గ్రామానికి చెందిన ఇంద్రకుమార్ తివారీ, పార్ట్‌టైమ్ టీచర్, రైతుగా పనిచేస్తున్నారు. అయితే, అతను వధువు కోసం నిరాశ వ్యక్తం చేసిన వీడియో వైరల్ కావడంతో, అతడికి ఉన్న 18 ఎకరాలను కొట్టేయాలని మోసగాళ్లు ప్లాన్ చేశారు.

కట్ చేస్తే, జూన్ 6న ఉత్తర్ ప్రదేశ్ కుషీ నగర్ జాతీయరహదారి పక్కన ఉన్న పొదల్లో తివారీ మృతదేహం లభ్యమైంది. మెడలో కత్తి ఇరుక్కుపోయి కనిపించింది. విచారణ చేస్తే దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. కుషి నగర్ ఎస్పీ సంతోష్ కుమార్ ప్రకారం, సాహిబా బానో అనే మహిళ ఖుషి తివారీగా నటిస్తూ, ఇంద్రకుమార్ తివారీని పెళ్లి చేసుకోవడం ఇష్టమని సోషల్ మీడియాలో సంప్రదించింది.

Read Also: Kolkata Rape Case: లా విద్యార్థినిపై అత్యాచారం.. తృణమూల్ కాంగ్రెస్‌లో విభేదాలు..

ఇంద్రకుమార్, సాహిబా క్రమంగా పరిచయం పెంచుకోవడంతో, ఆమె అతడిని ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు పిలిచింది. ఖుషి తివారీ ఇంద్రకుమార్‌ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అననుకున్నారు. ఆమె వివాహ ప్రతిపాదనను ఇంద్రకుమార్ అంగీకరించాడు. ఆ తర్వాత, సదరు మహిళ తన అనుచరులతో ఇంద్రకుమార్‌కి మెల్లిగా ఉచ్చు బిగించింది. ఇంద్రకుమార్ తాను పెళ్లి చేసుకోవడానికి కుషి నగర్ వెళ్తున్నట్లు బంధువులకు కూడా చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

గోరఖ్‌పూర్‌లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారని, కొన్ని రోజుల తర్వాత అతడి మృతదేహం లభ్యమైందని, మహిళ ఆమె అనుచరులు అతడిని చంపి, అతడి వద్ద ఉన్న నగలు, నగదుతో పారిపోయినట్లు అనుమానిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో సాహిబాను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి నకిలీ ఆధార్ కార్డ్ కూడా తయారు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును ఛేదించడానికి మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కలిసి పనిచేశారు.

Exit mobile version