అక్రమ సంబంధాల మోజులో కొందరు మహిళలు తమ సంసారాల్ని పాడు చేసుకుంటున్నారు. కుటుంబ పరువుల్ని బజారుకీడుస్తున్నారు. చివరికి భర్తల్ని కడతెర్చేందుకు కూడా వెనుకాడడం లేదు. తాజాగా ఓ మహిళ కూడా అలాంటి దారుణానికే ఒడిగట్టింది. ప్రియుడి మోజులో భర్తకు విషమిచ్చి హతమార్చింది. చివరికి పోలీసుల దర్యాప్తులో దొరికిపోయి, కటకటాలపాలయ్యింది. మైసూరులో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే..
మైసూరు జిల్లాకు చెందిన లోకమణి(36)కి పదేళ్ల క్రితం శిల్పతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే.. శిల్పకు పెళ్లి కాకముందు నుంచే తన ఇంటిపక్కన ఉండే అభినందన్‌తో అఫైర్ ఉండేది. అప్పుడే వీళ్లు తమ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కానీ, వీరి వివాహానికి శిల్ప కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పరిస్థితులు చెయ్యి దాకటముందే లోకమణికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లైన తర్వాత కూడా శిల్ప తన ప్రియుడితో సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది. ఎవ్వరికీ తెలియకుండా పదేళ్ల పాటు తమ అఫైర్ నడిపించారు. కానీ.. ఎన్నాళ్లిగా గుట్టుగా సాగించాలనుకున్న ఆ ఇద్దరు, లోకమణిని అడ్డు తొలగించాలని నిర్ణయించారు.
ప్లాన్ ప్రకారం.. ఓ రోజు శిల్ప తన భర్త లోకమణి భోజనంలో విషం కలిపింది. గంట తర్వాత అతడు మృతి చెందాడు. గుండెపోటు వచ్చి తన భర్త మరణించాడని అందరినీ నమ్మించింది. అయితే.. కొన్ని రోజుల్లోనే శిల్పలో మార్పు రావడాన్ని మృతుడి తల్లి గమనించింది. దీంతో.. కోడలే తన కొడుకుని చంపిందన్న అనుమానం బలపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. శిల్ప, ఆమె ప్రియుడు అభినందన్ తమ నేరాన్ని ఒప్పుకున్నారు. తమ అఫైర్ కోసం తామే లోకమణిని చంపామని అంగీకరించారు.