Wife Attacks Husband: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. మేడూరు గ్రామంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న చిన్నచిన్న గొడవలు ఈసారి పెద్ద దాడికి దారితీశాయి. వివరాల్లోకి వెళితే.. భర్త తన భార్యకు మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించాడు. దీనిపై ఆగ్రహానికి గురైన భార్య, ఇంట్లోని గొడ్డలి తీసుకుని భర్తపై దాడి చేసినట్లు తెలుస్తుంది.
Read Also: Star Hero : సొంత ఇండస్ట్రీకి ఆ స్టార్ హీరో ఎందుకనో దూరంగా ఉంటున్నాడు
ఈ ఘటనలో భర్త తీవ్రంగా గాయపడటంతో వెంటనే స్థానికులు కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, భర్త కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఈ ఘటన కలకలం రేపగా, కుటుంబ కలహాలు ఈ తరహా దాడులకు దారి తీశాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
