Site icon NTV Telugu

Jeedimetla Murder Case: సాఫీగా సాగుతున్న అంజలి జీవితంలో ఎందుకు అలజడి రేగింది..?

Hyd

Hyd

Jeedimetla Murder Case: సాఫీగా సాగుతున్న అంజలి జీవితంలో ఎందుకు అలజడి రేగింది..? కన్న కూతురే కాటేసే పరిస్థితి ఎందుకొచ్చింది..? కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురే.. కన్నతల్లిని ఎందుకంత కిరాతకంగా హత్య చేయాల్సి వచ్చింది..? హత్యకు సహకరించిన ఇద్దరు కుర్రాళ్లు ఎవరు..?

Read Also: Bihar Elections: బీహార్‌లో యంగ్ ఓటర్లే అధికం.. ఈసారి ఎటువైపో..!

తల్లి కష్టం నూటికి నూరుపాల్లు కన్న కూతురే అర్థం చేసుకోగలదు. ఎందుకంటే తానూ ఆడదే కాబట్టి !! అందులోనూ తండ్రి లేని కూతురు కాబట్టి… తల్లి తమను ఎంత కష్టపడి పెంచిందో తనకు మాత్రమే తెలుసు. అలాంటి కూతురు కన్నతల్లి పాలిట శాపంగా మారింది. ఇద్దరు కుర్రాళ్లతో కలిసి తల్లిసి హత్య చేసింది. అంజలి పెద్ద కూతురు తేజశ్రీ… ఇటీవలే తొమ్మదో తరగతి పూర్తి చేసుకుని పదో తరగతిలో అడుగుపెట్టింది. తేజశ్రీకి ఇన్‌స్టాగ్రామ్‌లో నల్గొండ జిల్లా కట్టంగూర్‌కి చెందిన శివ పరిచయం అయ్యాడు. శివ కట్టంగూర్‌లో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతూనే… డీజే ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్‌ చేసుకునే వాళ్లు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పలుమార్లు శివ నల్గొండ నుంచి జీడిమెట్ల వచ్చి తేజశ్రీని కలుస్తుండేవాడు. కొన్నిసార్లు ఇంటికి కూడా వచ్చాడు. ఇద్దరి మధ్య చనువు ఉన్న విషయం తల్లి అంజలి గమనించినా… ఇద్దరినీ ఏం అనలేదు. దీంతో… శివ కూడా అంజలి ఇంట్లో ఉండగానే తేజశ్రీని కలిసేందుకు నేరుగా ఇంటికి వచ్చేవాడు. తేజశ్రీ కూడా పలుమార్లు కట్టంగూర్‌లోని శివ ఇంటికి వెళ్లింది.

Read Also: Story Board: రియల్ ఎస్టేట్లో డౌన్ ట్రెండ్ కొనసాగుతుందా? కొనుగోలు శక్తి తగ్గిపోయిందా?

అయితే, ఉన్నట్టుండి అంజలి… ఇద్దరినీ మందలించింది. తన కూతురును తేజశ్రీకి దూరంగా ఉండాలని… కలిసేందుకు జీడిమెట్ల రావొద్దని వారించింది. అయినా.. శివ, తేజశ్రీ బయట కలిసేవాళ్లు. ఈ విషయం తెలుసుకున్న అంజలి.. ఈసారి కూతురు తేజశ్రీ పై చేయి చేసుకుంది. టెన్త్‌ క్లాస్‌ కి వచ్చిన నువ్వు… చదువుపై కాన్సన్‌ట్రేట్‌ చేయి కానీ.. ప్రేమ గీమ అంటూ శివ చుట్టూ తిరగొద్దని మందలించింది. అయినా సరే శివ ను కలుస్తా అంటే… చదువు మాన్పించి ఇంట్లో కూర్చోపెడతానని సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని శివకు చేరవేసింది తేజశ్రీ. ఇద్దరూ కలిసి ప్లాన్‌ వేశారు. లేచిపోయి పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈనెల 18న తల్లి ఇంట్లో లేని సమయం చూసుకుని తేజశ్రీ.. నల్గొండ వెళ్లింది. కట్టంగూరు లోని శివ ఇంటికి చేరుకుంది. శివ తల్లికి కూడా ఇద్దరి ప్రేమ విషయం తెలుసు కాబట్టి ఏం అనలేకపోయింది. ఇద్దరి ప్రేమ, పెళ్లికి శివ తల్లి నుంచి ఎలాంటి అడ్డంకి లేదు.

Read Also: NIA: విజయనగరం ఉగ్రకుట్ర కేసు ఎన్ఐఏకు బదిలీ!

కూతురు కనిపించకుండా పోవడంతో… అంజలి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పెద్ద కూతురు అంజలి మిస్‌ అయ్యిందని.. నల్గొండకి చెందిన శివ కిడ్నాప్‌ చేసి ఉంటాడని ఫిర్యాదు చేసింది. అంజలి ఫిర్యాదు తో దర్యాప్తు చేసిన పోలీసులు.. కట్టంగూరులోని శివ ఇంట్లో ఉన్న తేజశ్రీని ఈనెల 20న జీడిమెట్ల తీసుకొచ్చారు. తల్లికి సురక్షితంగా అప్పగించారు. శివపై కేసు నమోదు చేశారు. రెండు రోజులపాటు శివ ఇంట్లోనే తేజశ్రీ ఉంది కాబట్టి… శివ ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడా అనే అనుమానంతో.. తేజశ్రీకి వైద్య పరీక్షలు జరిపించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. రిపోర్ట్స్‌ ఆధారంగా శివపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చుదాం అనుకున్నారు.

Exit mobile version