Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Police: మద్యం, గంజాయి, డ్రగ్స్.. యువత ప్రాణాలను బలికోరుతున్నాయి. మత్తులో చేసే ప్రమాదాలతో నిండు నూరేళ్ల జీవితం గాల్లో కలిసిపోతోంది. కన్న వారికి పుట్టెడు గర్భశోకం మిగుల్చుతోంది. పుట్టిన రోజైనా.. చావు రోజైనా.. పెళ్లి జరిగినా.. ఇలా సందర్భం ఏదైనా సరే.. మద్యం ఏరులై పారుతోంది. ఆ తర్వాత జరిగే ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. దీనికి పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతో వరంగల్ జిల్లా పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. యువతకు అంత్యక్రియల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నానికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
READ ALSO: VJA CHEPPULA DANDA: ఇదా..? క్షమశిక్షణా..?
Also Read
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Vijayawada Road Accident: ఇద్దరి ప్రాణాలు బలిగొన్న కొబ్బరి బొండం
- Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
మద్యం మత్తు.. ఆపై మితిమీరిన వేగం.. యువత నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఏ యాక్సిడెంట్ చూసినా.. మద్యం మత్తు లేదా నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తున్నాయి. కారణమేదైనా.. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. లక్ష్మీపురం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన బైక్, ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి. అతివేగం వారి నిండు ప్రాణాలు తీసింది. బంధువుల అంత్యక్రియలు హాజరై.. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో యువకులు ప్రయాణిస్తున్న బైక్.. కమలాపూర్ మండలం లక్ష్మీపురం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనతో హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన యువకులను నవీన్ కుమార్, నాగరాజుగా గుర్తించారు. ఎదిగి వచ్చిన కొడుకులు హఠాన్మరణం చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ విచారణలో అతివేగం నిర్లక్ష్యం యువకుల ప్రాణాలు తీసినట్లు తేలింది. వారికి వారే వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీ కొట్టుకోవడం వల్ల వారి ప్రాణాలు పోయినట్లు అర్థమవుతుంది. అంతేకాదు ఇద్దరూ మద్యం సేవించినట్లు పోలీసులు నిర్ధారించారు. మద్యం మహమ్మారి వల్లే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారని తెలుసుకున్న పోలీసులు.. గ్రామంలోని మిగతా యువకులకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ ఇద్దరు యువకుల అంత్యక్రియలకు హాజరయ్యారు. వారు ప్రాణాలు కోల్పోయిన తీరును వివరించే ప్రయత్నం చేశారు.
ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి నేటి యువతను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. అంతేకాదు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించిన తీరుతో తల్లిదండ్రులు పిల్లల కోసం ఎలా శ్రమ పడుతున్నారు? పిల్లలు తల్లిదండ్రుల ఆశలని నిర్లక్ష్యంతో ఎలా వమ్ము చేస్తున్నారు? అనే విషయాన్ని వారి తల్లిదండ్రుల ద్వారానే అక్కడున్న యువతకు తెలిసేలా చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటుంది.
READ ALSO: Raakasa: ట్రెండీ లిరిక్స్‌తో ‘రాకాస’ ఫస్ట్ సింగిల్.. రామ్ మిర్యాల ‘రపప్పా.. రపప్పా’ పాట విన్నారా?
తాజావార్తలు
-
Rajamouli Goes Global: రాజమౌళికి అరుదైన గౌరవం
-
Hyderabad: జిమ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. యువతే టార్గెట్‌గా స్టెరాయిడ్స్, నిషేధిత ఇంజెక్షన్ల దందా..
-
Saikrishna Mother Vijayalakshmi: “నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?”.. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
-
Sreeleela: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన శ్రీలీల.. అబ్బాయిలూ నోట్ చేసుకోండి!
-
Saikrishna Case: “నా కొడుకు బూడిద నాకు కావాలి.. లేదంటే ఆత్మాహుతే..” సాయికృష్ణ తల్లి ఆవేదన
ట్రెండింగ్
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..