Visakha Constable Case: సంచలనం రేపుతున్న విశాఖ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలో కానిస్టేబుల్ రమేష్ హత్యకేసులో పోలీసులకు కీలక వీడియోలు దొరికాయి. ఇందులో రమేష్ భార్య శివానీ( శివజ్యోతి ) తెలివితేటలు చూసి షాకయ్యారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసే ముందు పెద్ద ప్లాన్ చేసింది. రమేష్‌ను హత్య చేసే ముందు ఎవరికీ డౌట్ రాకుండా భర్తతో ప్రేమగా ఉన్నట్టు వీడియోలు రికార్డు చేసింది. భర్తకు మటన్ కూడా వండిపెట్టి, మద్యం తాగించి.. నా భార్య మంచిదని ఆ వీడియోలో చెప్పించింది. ఇక, రమేష్ మత్తులో పడిపోతుంటే మంచంపై పడుకోబెట్టిన వీడియోలను కూడా రికార్డు చేసింది. ఆ తర్వాత నిద్రపోతుండగా దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. అందరికి గుండెపోటుతో చనిపోయినట్టు చెప్పింది. రమేశ్ చనిపోయిన తర్వాత ఎవరికి డౌట్ రాకుండా ముందుగానే వీడియోలు తీసిపెట్టుకున్నట్టు శివానీ పోలీసుల ముందు ఒప్పుకుంది. దీంతో ఆమె తెలివితేటలు చూసిన పోలీసులు కంగుతున్నారు.
Read Also: Test Match: ఈ ఏడాది టెస్టు మ్యాచ్‌ల ద్వారా అత్యధికంగా ఆర్జించిన టీమిండియా క్రికెటర్లు వీళ్లే..!
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్‌పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
విశాఖ వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బర్రి రమేష్‌కుమార్ భార్య శివాని ( శివజ్యోతి )తో కలిసి ఎంవీపీ కాలనీలో ఉంటున్నారు. ఈ నెల ఒకటో తేదీన విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన రమేష్ తెల్లవారేసరికి గుండెపోటుతో మృతి చెందాడంటూ భార్య ఎంవీపీ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ మల్లేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేశారు. తాము అన్యోన్యంగానే ఉంటున్నామని ఆమె కొన్ని వీడియోలను పోలీసులకు చూపించింది. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో ఊపిరాడక పోవడం వల్ల మృతి చెందినట్లు తేలింది. తమదైన శైలిలో పోలీసులు ఎంక్వైరీ చేయడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి.
Read Also: Santosh Sobhan: డైరెక్టర్ అవుతాడని అనుకోలే.. కానీ ఇప్పుడు ఓ బ్రాండ్ అవుతాడని నమ్మకం
రమేష్ హత్యకు ప్రియుడు రామారావుతో కలిసి శివానీ ప్లాన్ చేసింది. ఆమె తన దగ్గరున్న బంగారం రూ.1.50 లక్షలకు అమ్మి.. వెల్డింగ్ పనులు చేసే నీలాకు సుపారీ ఇచ్చారు. ఒకటో తేదీ రాత్రి రమేష్ ఇంటికి వచ్చి అన్నం తిని నిద్రపోయాడు. అనంతరం నీలాను పిలిచారు.. ఇక రమేష్ ముఖంపై నీలా దిండు పెట్టి గట్టిగా పట్టుకోగా, కదలకుండా శివానీ కాళ్లు పట్టుకొని ప్రాణాలు తీశారు. రామారావు ఇంటి బయట ఎవరూ రాకుండా చూశాడు. అయితే, ఎదురింట్లో ఉంటున్న రామారావుతో శివానీ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు విచారణలో తేలింది. ఏడాదిన్నరగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.. వీరిద్దరూ సన్నిహితంగా ఉండటం గమనించిన రమేష్.. ఓసారి రామారావుతో గొడవ పెట్టుకున్నట్లు ఒప్పుకున్నారు.
Read Also: Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్ల జీతాలను పెంచిన పీసీబీ..
అనంతరం రామారావు, శివానీ (శివజ్యోతి) కొన్ని రోజులు బయటకు వెళ్లిపోయారు. ఇరు వర్గాల కుటుంబీకులు రమేష్‌కు నచ్చజెప్పి శివానీని ఇంటికి తీసుకొచ్చారు. అయినా భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతునే ఉన్నాయి. దీంతో రామారావు దగ్గరికే వెళ్లిపోవాలని శివానీని రమేష్ మండిపడేవాడు. పిల్లలను తీసుకొని వెళ్తానని వాదించడంతో ఇద్దరి మధ్య తరచూగా గొడవ జరుగుతుండేది. భర్తను హత్య చేసి దాన్ని సాధారణ మృతిగా చిత్రీకరించి ఉద్యోగం ద్వారా వచ్చే అన్ని ప్రయోజనాలు పొందాలని శివానీ చూసింది. డబ్బుతో పాటు ఉద్యోగం కూడా వస్తుందని ఆమె అనుకుంది. అనంతరం రామారావుతో కలిసి ఉండాలనుకుంది. హత్యాకేసులో ఏ1గా శివానీ(శివజ్యోతి), ఏ2గా రామారావు, ఏ3గా నీలాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చాగా వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!