Vikarabad murder: వికారాబాద్ జిల్లా మాదారంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కల్లుకాంపౌండ్ పక్కనే అర్ధనగ్నంగా పడి ఉండడం కలకలం రేపుతోంది. అక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడం.. మహిళ ముఖంపై గాయాలు ఉండడంతో ఈ మర్డర్ మిస్టరీగా మారింది. మహిళను ఎవరు చంపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ పేరు శివగళ్ల పద్మ. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం స్వస్థలం. కొన్నాళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కూతురుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది. ప్రస్తుతం మాదారంలోని సొంత ఇంటిలో ఒంటరిగా ఉంటోంది..
READ ALSO: USA: #TrumpIsDead..! స్పందించిన యూఎస్ ఉపాధ్యక్షుడు ..
శివగళ్ల పద్మకు దాదాపు రోజు విడిచి రోజు కల్లు తాగే అలవాటు ఉంది. దీంతో ఊరిలోని కల్లు కాంపౌండ్‌కు వెళ్లి..తాగి ఇంటికి వెళ్తుంటుంది. శుక్రవారం రాత్రి కూడా కల్లు తాగి ఇంటికి వెళ్లింది. కానీ అనూహ్యంగా శనివారం ఉదయం అదే కల్లు కాంపౌండ్ పక్కనే ఉన్న సందులో అచేతనంగా పడి ఉంది. అంతే కాదు ఆమె ఒంటిపై బట్టలు తీసేసి ఉన్నాయి. ముఖంపై గాయాలు కూడా ఉన్నాయి. దీంతో అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు…
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల మర్డర్ ఎవరు చేసి ఉంటారనే దానిపై స్పష్టత రావడం లేదు. మరోవైపు కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్న నర్సింహులు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని చెబుతున్నారు పోలీసులు. పద్మ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు…
READ ALSO: USA: #TrumpIsDead..! స్పందించిన యూఎస్ ఉపాధ్యక్షుడు ..
