Vikarabad murder: వికారాబాద్ జిల్లా మాదారంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కల్లుకాంపౌండ్ పక్కనే అర్ధనగ్నంగా పడి ఉండడం కలకలం రేపుతోంది. అక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడం.. మహిళ ముఖంపై గాయాలు ఉండడంతో ఈ మర్డర్ మిస్టరీగా మారింది. మహిళను ఎవరు చంపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ పేరు శివగళ్ల పద్మ. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం స్వస్థలం. కొన్నాళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. ఉన్న…
Shadnagar Murder : షాద్‌నగర్ శివలీల (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే శివలీల హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకోమన్నందుకు శివలీలను హత్య చేసిన రౌడీషీటర్ దేవదాస్ గతంలోనూ రెండు హత్యలు, అత్యాయత్నాల కేసులో నిందితుడని పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఫరూఖ్‌నగర్ మండలం పిట్టలగడ్డతండాకు చెందిన శివలీల తన భర్త మృతి చెందడంతో తన తల్లి దగ్గర ఉంటూ.. కన్హాశాంతివనంలో కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. కర్నూల్‌కు…
విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఓ వివాహిత శవమై కనిపించిన ఘటన కలకలం రేపింది. బీచ్ ఒడ్డున మృతదేహం పడి ఉన్న తీరు ఆమెదీ హత్య, లేక ఆత్మహత్యనా అన్న అనుమానాలు రేకెత్తించాయి. ఇసుకలో సగం మృతదేహం కూరుకుపోయి.. మిగతా సగం అర్థ నగ్నంగా కనిపించింది. మంగళవారం అత్తారింట్లో నుండి వెళ్లిపోయిన వివాహిత, ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడ్డ అత్తామామలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.