Vanastalipuram M*urder: రెండు నెలల రెక్కీ.. వనస్థలిపురం హత్య కేసులో సంచలన విషయాలు..!

Murder Crime Hyd

Murder Crime Hyd

Vanastalipuram Murder: హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం వివేకానంద నగర్‌ లో చోటుచేసుకున్న మహిళ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రకు చెందిన సునితను ఆమె మొదటి భర్త దేవరకొండ మహేశ్ దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లా మంథని గ్రామానికి చెందిన మహేశ్, గతంలో సునితను వివాహం చేసుకుని ఆమెను కెనడాకు తీసుకెళ్లాడు.

Abhishek Sharma Form: 0, 0, 0.. అభిషేక్ షర్మ ఫామ్‌పై సూర్య ఏమన్నాడంటే?

×
×
Ad

అయితే అక్కడ భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తడంతో మహేశ్ తిరిగి భారత్‌ కు వచ్చాడు. అనంతరం సునిత అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహేశ్‌ పై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో మహేశ్ కెనడాకు తిరిగి వెళ్లలేక భారత్‌లోనే ఉండిపోయాడు. చివరకు 2024లో మహేశ్, సునిత విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. సునిత తరువాత త్రినాథ్ అనే యువకుడిని ప్రేమించి రెండో వివాహం చేసుకుని వనస్థలిపురం ప్రాంతంలో నివసిస్తోంది.

దీంతో మహేశ్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తన కెరీర్‌ను నాశనం చేసిందని భావించిన మహేశ్, సునితను ఎలాగైనా హత్య చేయాలని పథకం రచించాడు. ఇందుకోసం ఆమె ఆచూకీ కోసం రెండు నెలల పాటు వెతికిన మహేశ్.. తుర్కాయాంజాల్‌లోని అరుణ్ పీజీ హాస్టల్‌లో ఉంటూ సునిత నివాసాన్ని గుర్తించాడు. వనస్థలిపురంలోని కప్పుల చెరువు సమీపంలో ఆమె ఉంటున్నట్లు తెలుసుకున్న అనంతరం.. మూడు రోజుల పాటు ఆమె ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడు.

Dolby Atmos ఆడియో, 4K QLED విజువల్ ఉన్న Vu Vibe Series mart Google TVపై రూ.39000 భారీ డిస్కౌంట్!

హత్యను అమలు చేయడానికి మహేశ్ ముందుగానే ప్రణాళిక రూపొందించాడు. ఇందుకోసం ఆన్‌లైన్ ద్వారా కొబ్బరి బోండాలు కోయడానికి ఉపయోగించే కత్తి, చెట్ల కొమ్మలు కట్ చేసే కట్టర్, ఆటోమేటిక్ చైన్ రంపం వంటి ప్రమాదకర పరికరాలను కొనుగోలు చేశాడు. ఈ టూల్స్‌ను రెండు బ్యాగుల్లో హాస్టల్‌కు తీసుకువచ్చి, హత్యకు ముందురోజు రాత్రే సిద్ధంగా ఉంచుకున్నాడు. అనంతరం బుధవారం ఉదయం హాస్టల్ నుంచి బ్యాగులతో బయటకు వచ్చిన మహేశ్, ముందుగానే అద్దెకు తీసుకున్న సెల్ఫ్ డ్రైవ్ కారులో సునిత ఇంటి వద్దకు చేరుకున్నాడు. అపార్ట్‌మెంట్ వద్ద కారును ఆపి టూల్స్ ఉన్న బ్యాగులను పైకి తీసుకెళ్లి, అందులోని కత్తితో సునితపై దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.