UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- వివాహేతర సంబంధాన్ని వద్దన్నందుకు భర్త హత్య..
- ఉత్తర్ ప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లో దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP News: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించిన భర్తను భార్య, ఆమె లవర్ కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ప్రతాప్‌గఢ్ జిల్లాలో జరిగింది. చనిపోయిన వ్యక్తిని పాత్రల వ్యాపారిగా గుర్తించారు. ఈ కేసులో భార్య , ఆమె లవర్‌తో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. 45 ఏళ్ల ఉమాశంకర్ కౌశల్ అలియాస్ గుడ్డు మృతదేహం గురువారం ఉదయం లాల్గంజ్ ప్రాంతంలోని శీతల్మౌ కాలువ సమీపంలో కనిపించింది. ఈ కేసులో భార్య సుమన్ దేవి, షహన్ షా, విశాల్ శుక్లా, అవినాశ్ తివారీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉమాశంకర్ బుధవారం రాత్రి బైక్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గురువారం ఉదయం కాలువలో మృతదేహంగా కనిపించాడు. మృతుడి ఛాతి, తలపై ఇటుకలతో కొట్టి చంపినట్లు గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఉమాశంకర్ సోదరుడు ఈ హత్యలో భార్య సుమన్ దేవి, షహన్ షా ప్రమేయం ఉందని ఆరోపించడంతో కేసు విచారణ వేగవంతమైంది. సుమన్ దేవి, షహన్ షా మధ్య వివాహేతర సంబంధం ఉందని దీనిని వ్యతిరేకించడంతోనే భర్త ఉమాశంకర్ హత్య జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్యలో మరో ఇద్దరు కూడా సహకరించినట్లు గుర్తించారు. మొత్తం నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.
Also Read
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!