Site icon NTV Telugu

UP Video: కారు రూపంలో మృత్యువు.. కుమార్తెతో కలిసి తల్లి ఇంటికి వెళ్తుండగా ఘోరం

Upaccident

Upaccident

మృత్యువు ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. కారు రూపంలో మృత్యువు కబళించింది. ఒక్కసారిగా కారు దూసుకురావడంతో ఎగిరిపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

ఇది కూడా చదవండి: Ram Pothineni: రామ్ పోతినేని నెక్ట్స్ సినిమాలో నందమూరి హీరో.. ?

కాన్పూర్‌లో కిద్వాయ్ నగర్‌‌లో శుక్రవారం మధ్యాహ్నం తన 12 ఏళ్ల కుమార్తెతో కలిసి తల్లి స్కూటర్‌పై వెళ్తోంది. ఇంతలో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న కారు.. అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో 30 అడుగుల ఎత్తులో పడ్డారు. ఈ ఘటనలో తల్లి చనిపోగా.. కుమార్తె తీవ్రగాయాలయ్యాయి. క్లినిక్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. మృతురాలు హెల్మెట్ ధరించినా ప్రాణాలు నిలువలేదు.. ప్రాణ భయంతో తనువు చాలించింది. ఇద్దరు మైనర్ బాలురు, ఇద్దరు బాలికలు స్కూల్‌కు వెళ్లకుండా కారులో విన్యాసాలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల మైనర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Padi Kaushik Reddy: నోరు అదుపులో పెట్టుకో దానం నాగేందర్.. స్పాట్ ఎక్కడో చెప్పు నేను రావటానికి రెడీ..!

Exit mobile version