Shocking: జిమ్‌కు వెళ్తుందని భార్య దారుణహత్య..
- జిమ్‌కు వెళ్తుందని భార్య దారుణ హత్య..
- జిమ్ ట్రైనర్ల ప్రవర్తనపై అనుమానంతో భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: భార్య జిమ్‌కు వెళ్తోందని కలత చెందిన ఒక భర్త దారుణహత్యకు పాల్పడ్డాడు. జిమ్ ట్రైనర్ల ప్రవర్తన అనుచితంగా ఉందని భావించిన భర్త ఈ దారుణానికి ఒడిగట్టారు. భార్య జిమ్‌కు వెళ్లడంపై చాలా కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు చెలరేగుతున్నాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్‌లో జరిగింది. పోలీసులు ఈ హత్యకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు.
స్క్రాప్ డీలర్ అయిన శోభిత్ గుప్తా, తన ఇంట్లో తన భార్య పూనమ్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పదేళ్ల క్రితం ఈ జంటకు వివాహం కాగా, ఏడేళ్ల కుమార్తె ఉంది. పూనమ్ జిమ్‌కు వెళ్లడంపై వీరిద్దరి మధ్య తరుచుగా వాగ్వాదం జరిగేదని పోలీసులు చెప్పారు. బుధవారం ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో శోభిత్ ఇనుప రాడ్‌తో తన భార్య తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మరణించింది.
Also Read
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్‌వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
Read Also: Raghav Chadha: ఆప్‌కు రాఘవ్ చద్దా భారీ షాక్.. ఏకంగా ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి..
హత్య తర్వాత నిందితుడు దాదాపు 7 గంటలు శవం పక్కనే కూర్చుని, హత్యను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. తన భార్య కిందపడి గాయపడినట్లు అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. అయితే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అసలు విషయాన్ని రాబట్టారు.
పోలీస్ విచారణలో నిందితుడు చెప్పిన విషయాలు షాక్‌కు గురిచేశాయి. తన భార్య ప్రవర్తనపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని, అయితే జిమ్ వాతావరణం పట్ల తాను అభద్రతకు గురవుతున్నట్లు చెప్పాడు. జిమ్ ట్రైనర్లు మహిళల్ని చెడు ఉద్దేశ్యంతో చూస్తారని, వారిని ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారని చెప్పాడు. ఈ అనుమానమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్‌బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!