NTV Telugu Site icon

Crime: డబ్బు కోసం స్నేహితులతో భార్యపై అత్యాచారం.. మూడేళ్లుగా నరకం..

Up

Up

Crime: కలకాలం భార్యని కాపాడాల్సిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. యూపీలో బులంద్‌షహర్‌లో ఒక వ్యక్తి తన భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఈ చర్యను వారు వీడియో రికార్డ్ చేశారు. ముగ్గురిపై కేసు నమోదైంది. భర్త తన స్నేహితులకు తనపై అత్యాచారం చేయడానికి అనుమతించాడని ఫిర్యాదులో మహిళ పేర్కొంది. గత మూడు సంవత్సరాలుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లుగా చెప్పింది. తాను గర్భవతినని, తన భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడని వెల్లడించింది.

Read Also: Telangana: “భూభార‌తి”కి గ‌వ‌ర్నర్ ఆమోదం.. వీలైనంత త్వర‌గా అమ‌లులోకి

తనపై అత్యాచారానికి అనుమతించడం ద్వారా ఇద్దరు స్నేహితుల నుంచి భర్త డబ్బులు తీసుకున్నాడని 35 ఏళ్ల మహిళ ఆరోపించింది. తన బాధను చెప్పుకుంటే, ఎవరితో చెప్పవద్దని కోరినట్లు ఆమె చెప్పింది. ఇద్దరు నిందితులు లైంగిక చర్యల్ని రికార్డ్ చేసేవారని, తన భర్త సౌదీ అరేబియాలో వీడియోలు చూసేవాడని తెలిపింది.

నివేదిక ప్రకారం.. సదరు మహిళకు 2010లో బులంద్‌షహర్ వ్యక్తితో వివాహం జరిగింది. ఆ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. సౌదీ అరేబియాలో ఆటోమొబైల్ మెకానిక్‌గా పనిచేస్తున్న ఆమె భర్త ఏడాదికి రెండుసార్లు సొంతూరుకి వస్తాడు. మూడేళ్ల క్రితం భర్త ఇంటికి వచ్చినప్పుడు తన ఇద్దరు స్నేహితులు ఆమెపై అత్యాచారం చేయడానికి అనుమతించాడని తెలిసింది. భర్త సౌదీకి వెళ్లిన తర్వాత కూడా ఈ అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పిల్లల కోసం ఇదంతా మౌనంగా భరించినట్లు చెప్పింది, ఎవరితో అయినా చెబితే విడాకులు ఇస్తానని బెదిరించేవాడని వెల్లడించింది. ఇటీవల బంధువుల్లో ఒకరు ఆమె ఇంటికి వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబం అండగా నిలవడంతో ఆమె తన భర్తపై ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు నిందితుల అరెస్ట్ జరగలేదని, తదుపరి విచారణ జరుగుతోందని తెలిసింది.

Show comments