Mystery Man: యూపీలో ‘‘మిస్టరీ మ్యాన్’’ అరెస్ట్.. నిద్రిస్తున్న మహిళ తలపై కొట్టి, దోపిడీలు..

  • మిస్టరీ మ్యాన్‌ని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు..
  • మహిళల తలపై కొడుతూ, దోపిడీలు..
  • ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు..
Gorakhpur

Gorakhpur

Mystery Man: ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో రాత్రి సమయాల్లో ఇంట్లో నిద్రిస్తున్న మహిళల తలపై కొడుతూ, దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు నెలల్లో ఇలాంటి దోపిడీ కేసులు మొత్తం 5 జరిగాయి. ఇందులో ఒక మహిళ మరణించగా, నలుగురు గాయపడ్డారు. నిందితుడు అజయ్ నిషాద్‌గా గుర్తించారు. నిషాద్ 2022లో బాలలపై అత్యాచారం కేసును ఎదుర్కొన్నాడని, 6 నెలల పాటు జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన అతను కొన్ని రోజుల పాటు సూరత్‌లో ఉండీ, ఇటీవల గోరఖ్‌పూర్ తిరిగి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Sridhar Babu: పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని ‘మూసీ నిద్ర’ కార్యక్రమం చేశారు..

జూలై 30న తొలి దాడి చేశాడు. ఒక ఇంట్లోకి ప్రవేశించి ఒక మహిళ తలపై కొట్టి, కొన్ని నగలతో పారిపోయాడు. ఈ సంఘటన తర్వాత ఇదే విధంగా మరో మహిళపై దాడి చేశారు. ఇదే విధంగా ఒకే స్టైల్ తరహాలో దాడులుకు పాల్పడుతూ ఉన్నాడని సీనియర్ పోలీస్ అధికారి డాక్టర్ గౌరవ్ గ్రోవర్ మీడియాకు తెలిపారు. ఆగస్టు 12 ఇలాంటి ఘటనే జరిగింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఒక మహిళ మృతి చెందింది. ఆగస్టు 5, వంబర్ 10, నవంబర్ 14 తేదీల్లో మరో మూడు ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు.

అధికారులు మాట్లాడుతూ.. అజయ్ నిషాద్ దాడి చేసిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా నేరంలో అజయ్ నిషాద్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. అజయ్ నిషాద్ తప్పించుకునే సమయంలో కొందరు చూసి గుర్తించినట్లు తెలిపారు. దాడులకు ఉపయోగిస్తున్న ఇనుపరాడ్ ‌తో సహా పలు వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.