Site icon NTV Telugu

Uttar Pradesh: ఆన్‌లైన్ లో పరిచయమైన అమ్మాయిని కాల్చిచంపిన వ్యక్తి..

Uttar Pradesh

Uttar Pradesh

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన కాలేజీ విద్యార్థినిని ఓ యువకుడు దారుణంగా చంపాడు. తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన లక్నోలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఆదిత్యదేవ్ పాఠక్ అనే యువకుడికి నిష్ట అనే 23 ఏళ్ల యువతి పరిచమైంది. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అయితే పాఠక్, నిష్టను నాటు తుపాకీతో కాల్చి చంపేశాడు. గురువారం తెల్లవారుజామున గాయాలైన ఒక మహిళను ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు మాకు సమాచారం వచ్చిందని డీసీపీ సయ్యద్ అలీ అబ్బాస్ తెలిపారు.

Read Also: BJP JDS Alliance: ఎన్డీయేలో చేరిన జేడీఎస్.. స్వాగతిస్తున్నామన్న జేపీ నడ్డా

హర్దోయ్ కి చెందిన నిష్ట లక్నోలో ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమెకు సోషల్ మీడియా ద్వారా పాఠక్ పరిచమైనట్లు పోలీసులు తెలిపారు. బుధవారం నిష్ఠ చిన్‌హాట్ పోలీస్ స్టేసన్ ప్రాంతంలోని పాఠక్ అద్దె ఉంటున్న అపార్ట్మెంట్ కి వెళ్లింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో పాఠక్ ఆమెను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన తర్వా పాఠక్, నిష్ఠను ఆస్పత్రికి తీసుకుళ్లి, అక్కడే ఆమెను విడిచిపెట్టి పారిపోయాడని పోలీసులు తెలిపారు. తుపాకీ బుల్లెట్ వల్లే ఆమె మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చిన్‌హాట్ పోలీసులు నిందితుడు పాఠక్ పై ఐపీసీ 302 కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే హత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు.

Exit mobile version