Umrah Scam: ఉమ్రా యాత్ర పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసిన కేటుగాడు..!

  • కర్నూలు జిల్లాలో ఉమ్రా యాత్ర పేరుతో భారీ మోసం
  • దాదాపు రూ. 4 కోట్లు వసూలు చేసిన కేటుగాడు
  • హైదరాబాద్ పాత బస్తికి చెందిన వ్యక్తి ప్రధాన నిందితుడు
  • ఉమ్రా యాత్రకు పంపిస్తానని చెప్పి మాయమాటలు
  • ఒక్కొక్కరి నుంచి రూ. 40,000 చొప్పున వసూళ్లు
  • సుమారు 1000 మంది వరకు బాధితులు ఉన్నట్టు సమాచారం..
Umra Yatra

Umra Yatra

Umrah Scam: కర్నూలు జిల్లాలో ఉమ్ర యాత్ర పేరుతో 4 కోట్ల రూపాయలు మోసం చేశాడు ఒక కేటుగాడు. హైదరాబాద్ పాత బస్తికి చెందిన వ్యక్తి ఉమ్ర యాత్రకు పంపిస్తానని మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ. 40,000లు దాదాపు 1000 మంది నుంచి వసూలు చేశాడు. ఈ కేటుగాడు బాధితుల్లో కర్నూలు జిల్లాలోని కర్నూల్, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.

TTD Srivani Darshan Tickets New Rules: శ్రీవాణి దర్శన టికెట్ల విధానంలో మార్పులు… భక్తులకు మరింత సౌలభ్యం..

డబ్బులు తీసుకొని ముఖం చాటేయడంతో బాధితులు అతన్ని పట్టుకొని కర్నూలు పోలీసులకు అప్పగించారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా.. రెండు కోట్లు బాధితులకు ఇచ్చినట్టుగా తెలిపాడు నిందుతుడు. దీనితో అసలు ఈ మోసానికి ఎలా పాల్పడ్డారు..? మొత్తం ఎంత మంది మోసపోయారు..? ఎన్ని కోట్లు కొల్లగొట్టాడని పోలీసులు వారి స్టైల్ లో విచారణను మొదలు పెట్టారు.

LIC New Jeevan Anand: చనిపోయే వరకు తోడుండే పాలసీ.. రూ.45 తో రూ.25 లక్షల రిటర్న్స్‌తో పాటు లైఫ్ టైమ్ ఫ్రీ కవరేజ్!