భార్యకు ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఇష్టం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె.. ఎన్నికల్లో సీఎం ఆదిత్యానాథ్‌కు, ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా ఓటు వేసిందట.. దీంతో, ఆమెకు వేధింపులు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు.. అంతే కాదు.. ప్రధాని మోడీ అంటే నచ్చని తన భర్త.. నాకు ట్రిపుల్ తలాక్ చెప్పారని ఆవేన వ్యక్తం చేశారు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరదాబాద్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మొరదాబాద్ జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది ఓ మహిళ.. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి ఓటు వేయడంతో తన భర్త, అత్తింటివాళ్లు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది బాధితురాలు.. డిసెంబర్ 2019లో మొహమ్మద్ నదీమ్ పెళ్లి చేసుకున్నాడని పేర్కొన్న ఆమె.. తను మోడీకి మద్దతిస్తున్న విషయాన్ని పెళ్లి తర్వాత తెలుసుకున్న.. తన భర్త కుటుంబ సభ్యులు.. వేధింపులకు గురిచేశారని.. హింసించారని పేర్కొంది.. కొన్ని రోజులకు వేధింపులు మరింత తీవ్రమయ్యాయని.. చివరకు తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పి.. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో, ఐపీసీ 376, 511 సెక్షన్ల కింది నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. కాగా, ఆ మధ్య ట్రిపుల్ తలాక్‌కు సంబంధించిన ఎన్నో కేసులు వెలుగు చూస్తూ వచ్చాయి.. దీనిపై నరేంద్ర మోడీ సర్కార్ చట్టం తీసుకొచ్చిన తర్వాత.. ఈ కేసులు తగ్గుముఖం పట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి.