NTV Telugu Site icon

Tragedy In Holi Festival: హోలీ సంబరాల్లో విషాదం.. ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి..

Holi Tragedy

Holi Tragedy

Tragedy In Holi Festival In Telangana: మన భారతదేశంలో హోలీ సంబరాలను ఎంత ఘనంగా జరుపుకుంటారో అందరికీ తెలుసు. చిన్న, పెద్ద, వర్గ బేధాలేమీ లేకుండా.. ప్రతిఒక్కరూ ఈ వేడుకను జరుపుకుంటారు. అందరూ రోడ్లమీదకొచ్చి.. రంగులు పూసుకుంటారు. చివరికి శతృవులు కూడా తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టేసి.. ఈ వేడుకల్లో ఎంజాయ్ చేస్తారు. అలాంటి ఈ హోలీ సంబరాల్లో.. ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. కేవలం రంగు పూసిన పాపానికి.. ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు. పెట్రోల్ పోసి మరీ నిప్పంటించారు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

Kishan Reddy: కేసీఆర్‌కు జవాబిచ్చే సంస్కారం లేదు.. కిషన్ రెడ్డి ఫైర్

రేగోడ్ మండలం మర్పల్లిల్లో అందరూ హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రతిఒక్కరూ సరదాగా హోలీ ఆడుతూ.. ఆ క్షణాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అంజయ్య, షబ్బీర్ ధమ్య ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. షబ్బీర్ మీద రంగు పూసేందుకు అజయ్య ప్రయత్నించాడు. తన మీద రంగు పూయొద్దని చెప్పినా.. అంజయ్య వినకుండా రంగు పూశాడు. దీంతో కోపాద్రిక్తుడైన షబ్బీర్.. ఆ వ్యక్తితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి, వివాదం ముదిరింది. అప్పుడు షబ్బీర్ పెట్రోల్ తీసుకొచ్చి, అంజయ్యపై పోసి, నిప్పంటించాడు. ఈ నిప్పుల్లో అంజయ్య శరీరం చాలా వరకు కాలింది. స్థానికులు వెంటనే స్పందించి.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అతడ్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అంజయ్య పరిస్థితి విషమంగానే ఉంది.

Puri- Charmi: ఏయ్.. ఏయ్.. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు కెమెరా కంటికి చిక్కారు

మరోవైపు.. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. అంజయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన షబ్బీర్‌ని అదుపులోకి తీసుకున్నారు. కేవలం రంగు పూసిన కోపంలోనే షబ్బీర్ ఈ దారుణానికి పాల్పడ్డాడా? లేకపోతే గతంలో వీరి మధ్య గొడవలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అటు.. అంజయ్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలవ్వడంతో, అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

MLA Ravi Shankar: రవిశంకర్ సవాల్.. రేవంత్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి

Show comments