Tragedy In Holi Festival: హోలీ సంబరాల్లో విషాదం.. ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy In Holi Festival In Telangana: మన భారతదేశంలో హోలీ సంబరాలను ఎంత ఘనంగా జరుపుకుంటారో అందరికీ తెలుసు. చిన్న, పెద్ద, వర్గ బేధాలేమీ లేకుండా.. ప్రతిఒక్కరూ ఈ వేడుకను జరుపుకుంటారు. అందరూ రోడ్లమీదకొచ్చి.. రంగులు పూసుకుంటారు. చివరికి శతృవులు కూడా తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టేసి.. ఈ వేడుకల్లో ఎంజాయ్ చేస్తారు. అలాంటి ఈ హోలీ సంబరాల్లో.. ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. కేవలం రంగు పూసిన పాపానికి.. ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు. పెట్రోల్ పోసి మరీ నిప్పంటించారు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Kishan Reddy: కేసీఆర్‌కు జవాబిచ్చే సంస్కారం లేదు.. కిషన్ రెడ్డి ఫైర్
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
రేగోడ్ మండలం మర్పల్లిల్లో అందరూ హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రతిఒక్కరూ సరదాగా హోలీ ఆడుతూ.. ఆ క్షణాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అంజయ్య, షబ్బీర్ ధమ్య ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. షబ్బీర్ మీద రంగు పూసేందుకు అజయ్య ప్రయత్నించాడు. తన మీద రంగు పూయొద్దని చెప్పినా.. అంజయ్య వినకుండా రంగు పూశాడు. దీంతో కోపాద్రిక్తుడైన షబ్బీర్.. ఆ వ్యక్తితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి, వివాదం ముదిరింది. అప్పుడు షబ్బీర్ పెట్రోల్ తీసుకొచ్చి, అంజయ్యపై పోసి, నిప్పంటించాడు. ఈ నిప్పుల్లో అంజయ్య శరీరం చాలా వరకు కాలింది. స్థానికులు వెంటనే స్పందించి.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అతడ్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అంజయ్య పరిస్థితి విషమంగానే ఉంది.
Puri- Charmi: ఏయ్.. ఏయ్.. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు కెమెరా కంటికి చిక్కారు
మరోవైపు.. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. అంజయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన షబ్బీర్‌ని అదుపులోకి తీసుకున్నారు. కేవలం రంగు పూసిన కోపంలోనే షబ్బీర్ ఈ దారుణానికి పాల్పడ్డాడా? లేకపోతే గతంలో వీరి మధ్య గొడవలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అటు.. అంజయ్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలవ్వడంతో, అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
MLA Ravi Shankar: రవిశంకర్ సవాల్.. రేవంత్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!