Extramarital Affair: టెంపుల్ సిటీ తిరుపతిలో ఓ వివాహేతర సంబంధం వివాదం తీవ్ర సంచలనం రేపుతుంది. అక్రమ సంబంధం తెంచుకోవాలని చెప్పిన వివాహితను అజీమ్ అనే వ్యక్తి బెదిరించి, ఆమెతో పాటు ఆమె తల్లిని కూడా కిడ్నాప్ చేసి దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతికి చెందిన ఓ మహిళ తన ఇంటి దగ్గర టైలరింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఆమె భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఈ క్రమంలో కొర్లగుంటకు చెందిన అజీమ్‌తో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఇక, ఇంట్లో ఈ విషయం బయటపడుతుందనే భయంతో ఆ మహిళ ఈ సంబంధాన్ని తెంచుకోవాలని ఫిక్స్ అయింది. దీనికి అజీమ్ ఒప్పుకోకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది.
Read Also: Rahul Gandhi vs BJP: స్పీకర్‌నే లెక్కచేయరు.. రాహుల్‌గాంధీతో యూపీ మంత్రి వాగ్వాదం
ఈ నేపథ్యంలో అజీమ్, లక్ష్మీపురం సర్కిల్‌లోని జిమ్ దగ్గరకు రావాలని మహిళ, ఆమె తల్లికి ఫోన్ చేశాడు. డ్రైవర్ బబ్లూ సహకారంతో వారిని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా తన ప్రేమను ఒప్పుకోకపోతే ఇద్దరినీ చంపేస్తామని బెదిరించాడు. ఇక, భయాందోళనకు గురైనా మహిళ, ఆమె తల్లి 112 నెంబర్‌కు కాల్ చేసింది. వెంటనే, రంగంలోకి దిగిన ఈస్ట్ సీఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అజీమ్ ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్ ఆధారంగా అతడి ఆచూకీని కనిపెట్టి, లక్ష్మీపురం సర్కిల్ దగ్గర పోలీస్ బృందం మాటు వేసి నిందితులను అదుపులోకి తీసుకుంది. ఇక, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
