రోజురోజుకూ సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. చిన్నా పెద్ద, వావివరుస లేకుండా మగాళ్లు.. కామాంధులుగా మారుతున్నారు. తాజాగా ఒక బాలికపై ముగ్గురు అన్నదమ్ములు సామూహిక అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బార్మర్ జిల్లాలో లో ఒక వ్యక్తి పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. అతడికి గతకొన్నిరోజుల క్రితం ఒక బాలికతో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయంతో అతడు.. అతని ఇంట్లో జరిగే ఫంక్షన్ కి బాలికను ఆహ్వానించాడు. ఆమె రానంటున్న బలవంతంగా తీసుకెళ్లి ఇంట్లో ఎవరికి తెలియకుండా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
అనంతరం బాలికను అతడి సోదరుడికి అప్పగించాడు. అతను ఆమెను నెలన్నర రోజులు తనతో పాటు జోధ్‌పూర్‌లో ఉంచి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి అత్యాచారానికి తెగబడ్డాడు. వీరిద్దరూ అయిపోయాకా మరో సోదరుడు బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. ఎట్టకేలకు ఇటీవల బాలిక ఆ చెరనుంచి తప్పించుకొని ఇంటికి చేరుకొని, తన సోదరుడి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
