NTV Telugu Site icon

Crime: మద్యం మత్తులో వైద్యుడు అత్యాచారయత్నం.. ప్రైవేట్‌ పార్ట్‌ కోసేసిన నర్సు

Crime

Crime

బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన డాక్టర్‌ ప్రైవేట్‌ పార్ట్‌ను నర్సు కోసేసింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో డాక్టర్‌తో పాటు మరో ఇద్దరు సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వైద్యుడు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. ఈ సంఘటన ముశ్రీఘరారి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాపూర్‌లోని ఆర్‌బిఎస్ హెల్త్ కేర్‌లో జరిగింది. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ సంజు తన ఇద్దరు సహోద్యోగులతో కలిసి మొదట మద్యం సేవించాడని, ఆ తర్వాత నర్సుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. నర్సు నిరాకరించింది. తనను తాను ఎలాగైనా కాపాడుకునేందుకు ధైర్యం చేసి సర్జికల్ బ్లేడ్‌తో డాక్టర్ ప్రైవేట్ పార్ట్‌ను కోసేసింది. అనంతరం నర్సు అక్కడి నుంచి పారిపోయింది.

READ MORE: Harish Rao: హరీష్ రావు ఎడమ చేతికి గాయం.. నొప్పితో బాధపడుతూ పీఎస్లోకి (వీడియో)

ఇద్దరు డాక్టర్ సహోద్యోగులు ఆమెను పట్టుకునేందుకు పరిగెత్తారు. నర్స్ తన ఫోన్ నుంచి వెంటనే డయల్ 112 కి కాల్ చేసి ఈ విషయాన్ని తెలియజేసింది. ఎస్పీ వినయ్ తివారీ ఆదేశాల మేరకు ఓ బృందం దాడులు నిర్వహించి వైద్యుడ్ని, మరో ఇద్దరు సహచరులను కూడా పట్టుకున్నారు. ఘటనా స్థలం నుంచి రక్తంతో తడిసిన దుస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు డాక్టర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.

READ MORE:Supreme court: ‘‘ బుల్డోజర్ న్యాయం ‘‘పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

బాధితురాలు 112కు అర్ధరాత్రి కాల్ చేసిందని సదర్ డీఎస్పీ సంజయ్ కుమార్ పాండే తెలిపారు. ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నర్సు గత 10 నుంచి 15 నెలలుగా ఆర్‌బీఎస్‌ ఆస్పత్రిలో పనిచేస్తోంది. పోలీసులు సంఘటన స్థలం నుంచి మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలంలో బెడ్ సీటు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరగడానికి ముందు సీసీటీవీ కెమెరా స్విచ్ ఆఫ్ చేయబడింది. అరెస్టయిన నిందితులను డాక్టర్ సంజయ్ కుమార్ సంజుగా గుర్తించారు. రెండో సహచరుడిని వైశాలి జిల్లా బలిగావ్ పోలీస్ స్టేషన్‌లో నివాసం ఉంటున్న సునీల్ కుమార్ గుప్తాగా గుర్తించగా, మూడో వ్యక్తి బాంగ్రాలోని వాజిత్‌పూర్ సర్సౌనా పోలీస్ స్టేషన్‌లో నివాసం ఉంటున్న అవధేష్ కుమార్‌గా గుర్తించారు.

Show comments