ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా మహిళలపై జరిగే అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. బడి, గుడి, ఆఫీస్, ఇల్లు అని తేడా లేకుండా పోయింది. అన్న, నాన్న, మామ, స్నేహితుడు ఎవరిని నమ్మలేకుండా పోతుంది. తాజాగా కోడలిని కన్న కూతురిలా చూసుకోవాల్సిన ఒక మామ ఆమెపైనే కన్ను వేశాడు. కొడుకు ఇంట్లో లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. గ్వాలియర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో ఒక మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవలే తన అత్తగారు మృతిచెందడంతో మామగారిని జాగ్రత్తగా చూసుకొంటుంది. ఆర్థిక ఇబ్బందుల వలన కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతూన్నాయి. ఈ నేపథ్యంలోనే భర్త పని మీద వేరే ఊరు వెళ్లడంతో మామ కన్ను కోడలిపై పడింది. కొడుకు ఇంట్లో లేకపోవడంతో అర్ధరాత్రి ఒంటరిగా గదిలో పడుకున్న కోడలి వద్దకు వచ్చిన మామ ఆమెపై బలాత్కారం చేయబోయాడు.
కోడలు వద్దని వారించినా నా కొడుకు లేడుగా.. వాడి లేని లోటు నేను తీరుస్తా అంటూ అసభ్యంగా మాట్లాడుతూ ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెపితే ప్రాణాలు తీసేస్తానని బెదిరించాడు. ఉదయం ఏదో విధంగా తప్పించుకున్న కోడలు తన పుట్టింటికి వెళ్లి జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు వెంటనే మామ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.