తెలంగాణ మహబూబ్నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. బాలానగర్ చౌరస్తాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ అతివేగంతో వచ్చి ఆగి ఉన్న ఆటో, బైక్‌ని ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా ఆరుగురు మృతి చెందారు.. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తుంది..
వివరాల్లోకి వెళితే.. బాలానగర్ చౌరస్తాలో శనివారం సంత జరుగుతుంది. కూరగాయలు, ఇతర వస్తువులు అమ్మేవాళ్లు, కొనేవాళ్లతో అక్కడ ప్రాంతమంతా బిజీబిజీగా ఉంటుంది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తున్న ఆటో, మోటార్ సైకిల్ ను హైదరాబాద్ నుంచి వస్తున్న డీసీఎం వేగంగా వచ్చి ఢీ కొట్టింది… ఈ ప్రమాదంలో అక్కడిక్కడే ముగ్గురు మరణించగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు మరణించారు.. గాయపడిన మౌనిక అనే మహిళను జిల్లా ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్న భద్ర సింగ్ అనే వ్యక్తిని మెరుగైన వైద్యం కోసంహైదరాబాద్ కు తరలించారు..
ఢిసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని వాహనాన్ని ఆందోళనకారులు తగలబెట్టారు. ఘటన స్థలానికి వచ్చిన జడ్చర్ల రూరల్ సీఐ, బాలానగర్ ఎస్‌ఐను ఆందోళనకారులు షాపులో నిర్బంధించారు. సంత నాడు ట్రాఫిక్ నిర్వహణ సరిగా చేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఈ ప్రమాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..