Tamil Nadu: తండ్రీ కొడుకుల మధ్య గోడవలు అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్ఐపై వారే ఎదురు తిరిగారు. తమ మధ్య ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ వేటకొడవలితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మడత్తుకుళం అన్నాడీఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్ కు చెందిన మామిడితోటలో పని చేస్తున్న తండ్రీకొడుకులు ఘర్షణ పడుతున్నారంటూ మంగళవారం రాత్రి పోలీసులకు సమాచారం వచ్చింది.
Read Also: Trupm-Putin: వచ్చే వారం ట్రంప్-పుతిన్ ప్రత్యక్ష భేటీ.. జెలెన్‌స్కీ కూడా హాజరయ్యే ఛాన్స్
ఇక, పెట్రోలింగ్ చేస్తున్న అళంగియ దళవాయ్పట్టినం ప్రాంతానికి చెందిన స్పెషల్ ఎస్ఐ షణ్ముగవేల్, డ్రైవర్ అళగురాజాను తీసుకుని హూటాహూటిన ఘటనా స్థలికి వెళ్లారు. అయితే, అక్కడ తోటలో పని చేసే మూర్తి, అతడి కుమారుడు తంగపాండ్యన్ తాగిన మైకంలో కర్రలతో కొట్టుకుంటూ కనిపించారు. ఈ ఘటనలో మూర్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరినీ షణ్ముగవేల్ విడదీసి.. మూర్తిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలు చేశాడు.. ఇదే సమయంలో తంగపాండ్యన్ వేటకొడవలిలో ఎస్ఐ షణ్ముగవేల్ పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. మూర్తి సైతం తన కొడుక్కి అండగా నిలిచి, షణ్ముగవేల్ పై దాడికి పాల్పడ్డాడు.
Read Also: Sourav Ganguly: మరోసారి సౌరవ్ గంగూలీ పోటీ.. ఈసారి కూడా ఏకగ్రీవమేనా!
అయితే, నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన జీపు డ్రైవర్ పైనా కూడా దాడికి దిగారు. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయి, ఉన్నతాధికారులకు సమాచారం అందజేశాడు. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు రక్తపుమడుగులో పడి ఉన్న ఎస్ఐ షణ్ముగవేల్ మృతదేహం కనిపించింది. ఇక, తండ్రి కొడుకులను అరెస్ట్ చేసి విచారించడానికి తీసుకుని వెళ్తుండగా.. మార్గమధ్యలో తప్పించుకోవడానికి కొడుకు ప్రయత్నం చేయడంతో.. అతడ్ని కాల్చి చంపేశారు పోలీసులు.
