Matrimonial site: ఇటీవల కాలంలో మాట్రిమోనియల్ సైట్లలో పరిచయాలు మోసాలకు కారణమవుతున్నాయి. అమ్మాయిలకు మంచి వరుడిని తెవాలనే తల్లిదండ్రులు తపన కొందరు దుర్మార్గులకు ఆసరాగా మారుతోంది. ఉద్యోగం లేకున్నా, తనకు మంచి ఉద్యోగం, కోట్లలో ఆస్తులు ఉన్నాయని ఫోజ్ ఇస్తూ యువతులను వలలో వేస్తున్నారు. అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు కూడా ముందు వెనక ఆలోచించకుండా వారి చేతుల్లో మోసపోతున్నారు.
మూఢనమ్మకాల పేరుతో కొందరు వ్యక్తులు ప్రజలను మోసం చేస్తున్నారు. నేల నుండి నింగికి చేరుకునే సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా.. ప్రజల్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. కళ్లకి ఎదురుగా మూఢనమ్మకాల పేరుతో డబ్బు దోచుకుంటున్న అపరచితులని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు.