Site icon NTV Telugu

Kolkata Student Case: విద్యార్థినిపై అత్యాచారం.. నిందితుడికి అభిషేక్ బెనర్జీ, టీఎంసీ మంత్రులతో సంబంధాలు..

Kolkata Rape Case

Kolkata Rape Case

Kolkata Student Case: కోల్‌కతా లా కాలేజీ క్యాంపస్‌లో 24 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. నిందితుల్లో ఒకరు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) విద్యార్థి విభాగం నేత కావడంతో ఈ కేసు రాజకీయంగా చర్చకు దారి తీసింది. గతేడాది ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో పీజీ వైద్యురాలిపై అత్యాచార ఘటన మరిచిపోక ముందే ఈ సంఘటన జరిగింది.

Read Also: POK: భారత్‌పై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పాక్..? ధ్వంసమైన ఉగ్ర శిబిరాల పునర్నిర్మాణం..?

కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలోని సౌత్ కలకత్తా లా కాలేజీ మాజీ విద్యార్థి మనోజిత్ మిశ్రా(31)తో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం సమయంలో వీడియోలు తీసిన ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే, ప్రధాన నిందితుడు అధికార టీఎంసీ పార్టీ స్టూడెంట్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. మరో ఏడాదిలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో, ప్రధాన నిందితుడితో మమతా బెనర్జీ పార్టీకి ఉన్న సంబంధాలను బీజేపీ సోషల్ మీడియా వేదికగా హైలెట్ చేసింది. టీఎంసీలో మమతా తర్వాత స్థానంలో ఉన్న ఎంపీ అభిషేక్ బెనర్జీతో నిందితుడు మనోజిత్ మిశ్రా ఉన్న ఫోటోని షేర్ చేసింది. బెంగాల్ హెల్త్ మినిస్టర్ చంద్రిమా భట్టాచార్య, సీఎం మమతా బెనర్జీ వదిన, కౌన్సిలర్ కజారీ బెనర్జీతో సహా ఇతర టీఎంసీ నేతలతో నిందితుడు ఉన్న ఫోటోలను ఎక్స్‌లో పంచుకుంది.

Exit mobile version