MP Revenge Story: పదేళ్ల నాటి పగ.. పట్టపగలే ఆరుగురిని కాల్చి చంపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Six of family gunned down in Madhya Pradesh revenge killing: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం పట్టపగలే.. కొందరు దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తుల్ని కాల్చి చంపారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురిని ఆసుపత్రిని తరలిస్తుండగా తుదిశ్వాస వదిలారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పదేళ్ల క్రితం తమ కుటుంబసభ్యుల్ని చంపినందుకు ప్రతీకారంగా.. ఆ దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Prachhaya Lunar Eclipse Live: ప్రచ్ఛాయ చంద్రగ్రహణం.. ఏంచేయాలో తెలుసా?
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
మొరేనాకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపా గ్రామంలో.. ధీర్ సింగ్, గజేంద్ర సింగ్ అనే రెండు కుటుంబాలు ఉన్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య ఆస్తుల విషయంలో ఎప్పటినుంచో శతృత్వం ఉంది. ఇందులో భాగంగానే.. 2013లో ధీర్ సింగ్ కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల్ని గజేంద్ర సింగ్ కుటుంబీకులు చంపారు. అప్పటి నుంచి ఆ రెండు ఫ్యామిలీల మధ్య శతృత్వం తారాస్థాయికి చేరుకుంది. గజేంద్ర సింగ్ కుటుంబంపై పగ పెంచుకున్న ధీర్ సింగ్ కుటుంబీకులు.. ప్రతీకారం తీర్చుకోవడం కోసం సరైన సమయం కోసం వేచి చూశారు. ఈ కేసు విచారణ కొన్ని సంవత్సరాల వరకు కొనసాగింది. చివరికి గజేంద్ర సింగ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు జైలుశిక్ష పడటంతో.. వాళ్లు నాలుగైదేళ్లు జైలుశిక్ష అనుభవించారు. ఈ శుక్రవారమే వాళ్లు జైలు నుంచి విడుదల అయ్యారు.
Minister KTR : బీఆర్‌ఎస్ అంటే భారత్ రైతు సమితి
ఈ విషయం తెలుసుకున్న ధీర్ సింగ్ కుటుంబీకులు.. ఇదే సరైన సమయమని భావించి, తుపాకులు తీసుకొని వారిపై కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం ఉదయం 9:30 – 10:00 గంటల మధ్య వాళ్లు కాల్పులు జరిపారు. వీరిని అడ్డుకోవడానికి మహిళలు చెక్క కర్రల్ని విసిరారు. అయితే.. వాళ్లు వెనక్కు తగ్గకుండా కాల్పులు జరపగా, ఆరుగురు హతమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా ఐదుగురి కోసం గాలిస్తున్నారు. పాత కక్షల వల్లే ఈ కాల్పులు జరిగినట్టు తేలిందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
-
Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
-
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!