ఈరోజు ప్రచ్ఛాయ చంద్రగ్రహణం.. ఎవరు ఏ నియమాలు పాటించాలో తెలుసుకోండి . సూర్య, చంద్రగ్రహణాలపై ప్రజలకు ఆసక్తి వుంటుంది. గ్రహణాల రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఆలోచిస్తుంటారు. ఈరోజు ప్రచ్ఛాయ చంద్రగ్రహణం.. ఎవరు ఏ నియమాలు పాటించాలో వివరిస్తున్నారు పండితులు. ఈ ఏడాదిలో మొత్తం నాలుగు గ్రహణాలు (Eclipses) ఏర్పడనున్నాయి. వీటిలో రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు. ఇప్పటికే ఏప్రిల్ 20న మొదటి గ్రహణం సంభవించింది.
ఇది సూర్యగ్రహణం (Solar Eclipse) ….ఇది ఏర్పడిన రెండు వారాలకే చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడుతోంది. శుక్రవారం (మే 5న) రెండో గ్రహణం సంభవిస్తోంది. ఈ చంద్ర గ్రహణం ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో కనువిందు చేయనుంది. చంద్రుడి కంటే భూమి పెద్ద కావడం వల్ల నీడ కూడా ఎంతో ఎక్కువ. చంద్రుడు ఎరుపు రంగులో కాకుండా మరింత చీకటిలో ఉన్నట్లు కనిపిస్తాడు. ఎందుకంటే, ఏర్పడబోయే చంద్రగ్రహణంలో భూమి కోణం 5 డిగ్రీల ఎత్తులో ఉంటుంది. దీని వల్ల భూవాతావరణ ప్రభావం చంద్రుడిపై ఉండదు కాబట్టి గ్రహణం తేలికైన రంగులో కనిపిస్తుంది. గ్రహణం సందర్భంగా ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది తెలుసుకోండి.