Site icon NTV Telugu

Secunderabad: కోచ్ వేధింపులతో విద్యార్థిని బలి.. కీచక కోచ్ అరెస్ట్..

Coach

Coach

Secunderabad: ప్రేమ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. తనను ప్రేమించమంటూ వెంటపడి, వేధించి, చివరకు యువతి మృతికి కారణమైన వాలీబాల్‌ కోచ్‌ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే.. వాలీబాల్‌ కోచ్‌ పారిపోయాడు. పరారీలో ఉన్న కోచ్‌కు సంబంధించిన పక్కా సమాచారం రావడంతో రైళ్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు అంబాజీ నాయక్. వాలీబాల్ కోచ్‌గా పని చేస్తున్నాడు. ఇతని ప్రేమ వేధింపుల కారణంగా.. సికింద్రాబాద్‌ లాలాగూడలోని రైల్యే డిగ్రీ కాలేజీలో బీఏ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న మౌనిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది..

READ MORE: Fake Notes: కామారెడ్డిలో తీగలాగితే.. బీహార్‌లో దొరికిన దొంగనోట్ల ముఠా

కాలేజీ నుంచి ఆమె సోదరుడు ఇంటికి తీసుకొని వచ్చిన.. అరగంటకే ఆమె ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమనాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. మరుసటి రోజు పోస్టుమార్టం పూర్తయిన తరువాత మౌనిక, స్నేహితులు కొన్ని విషయాలను కుటుంబసభ్యులకు తెలిపారు. ప్రేమ పేరుతో కొత్తగా వచ్చిన వాలీబాల్‌ కోచ్‌ అంబాజీనాయక్‌, వేధింపులకు గురి చేస్తున్నాడని మౌనిక తండ్రి ప్రమోద్‌, తల్లి హరితలకు చెప్పారు. దీంతో మౌనిక మృతికి ప్రేమ పేరుతో వేధింపులే కారణమని, వాలీబాల్‌ కోచ్‌ అంబాజీనాయక్‌ వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన మౌనిక ఆత్మహత్య చేసుకుందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మౌనిక ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే.. వాలీబాల్‌ కోచ్‌ అంబాజీ నాయక్‌ పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అంబాజీ స్వగ్రామానికి పోలీసులు వెళ్లి అతని వివరాలు ఆరా తీశారు.

READ MORE: Juice: జ్యూస్ తాగి 15 గంటల పాటు నిద్రపోయిన పలువురు వ్యక్తులు.. ఆ ముస్లిం యువకుడు ఎవరు?

నిజామాబాద్‌ నుంచి అంబాజీ తిరుపతికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతిలో ఓ అడ్వకేట్‌ను సంప్రదించి.. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినట్లుగా గుర్తించారు. తిరుపతి నుంచి తిరిగి వెళ్తుండగా.. పక్కా సమచారంతో అంబాజీని ట్రైన్‌లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కచి నుండి నేరుగా లాలాగూడా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొని వచ్చి విచారిస్తున్నారు. మౌనికను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశారంటూ ఆమె తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుపై అంబాజీని విచారిస్తున్నారు పోలీసులు. అంబాజీ నాయక్‌.. సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ ఫోన్‌లో ఉన్నడేటాను డిలీట్‌ చేసినట్లుగా భావిస్తున్నారు. మౌనికతో జరిపిన చాటింగ్‌ మొత్తాన్ని అంబాజీ తన ఫోన్‌లో డిలీట్‌ చేశాడని గుర్తించారు. దీంతో డేటాను రిట్రీవ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఫోన్ డేటా ఈ కేసులో కీలకంగా మారనుంది. అంబాజీ, మౌనికను ఎలా వేధింపులకు గురి చేశాడో పక్కా ఎవిడెన్స్‌ దొరికే అవకాశం ఉంది.

Exit mobile version