Bihar: ప్రియుడు ఉండగా మరొకరితో పెళ్లికి రెడీ.. సీన్ కట్ చేస్తే ఎంత ఘోరానికి ఒడిగట్టిందంటే..!
- బీహార్‌లో షాకింగ్ మర్డర్
- దారుణానికి ఒడిగట్టిన స్నేహితురాలు
- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకి నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా హంతకుల్లో మార్పు రావడం లేదు. మానవత్వం నశించి క్రూరంగా తయారవుతున్నారు. ఒకప్పుడు మహిళలంటే సున్నిత మనస్కులు అనుకునేవారు. చాలా మంది రక్తం చూస్తేనే వణికిపోతారు. అలాంటిది ఇప్పుడు మహిళలు రక్తం చిందిస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు గానీ.. హంతకురాళ్లుగా మారిపోతున్నారు. దేశంలో ఎక్కడొక చోట మహిళలు హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా బీహార్‌లో పెళ్లికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడిని చంపబోయి మరొకరి ఊపిరి తీసింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: UP: 9 ఏళ్లుగా లవ్.. 2 నెలల క్రితం పెళ్లి.. శవమైన భర్త.. మిస్టరీ ఏంటంటే..!
Also Read
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
- Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సృష్టి కుమారి అనే యువతి.. పొరిగింటి యువకుడైన ప్రేమ్ పాసితో లవ్ ఎఫైర్ నడిపిస్తోంది. ఇంతలో ఆమెకు మరో యవకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. దీంతో ప్రియుడిని వదిలిపెట్టి మరొకరి యువకుడిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో ప్రేమ్ పాసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం మొదలు పెట్టాడు. ప్రియుడి టార్చర్‌తో సృష్టి కుమారి విసిగిపోయింది. ఎలాగైనా ప్రియుడిని అంతమొందించాలని ప్రణాళిక రచించింది. దీంతో తనకు సోదరుడైన సోహైల్ ఖాన్‌ను సంప్రదించి ప్రేమ్ పాసిని చంపేయాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: AP High Court: అంబటి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ
అయితే జనవరి 21న సాయంత్రం సోహైల్ ఖాన్, సహచరుడు ఆశిష్ పాండేతో కలిసి భగవాన్‌పూర్ మార్కెట్‌కు బైక్‌పై వెళ్లారు. అక్కడ ఒక మైనర్ గైడ్ చేస్తున్నాడు. ఇంతలో ప్రేమ్ పాసి ఒక దుకాణం దగ్గర బైక్ పార్కు చేసి లోపలికి వెళ్లాడు. ఆ బైక్ దగ్గరే సుశీల్ చౌరాసియా అనే వ్యక్తి నిలబడి ఉన్నాడు. చలి కారణంగా సుశీల్ ముఖాన్ని మఫ్లర్‌తో కప్పుకున్నాడు. అయితే అతడు ప్రేమ్ పాసి అని తప్పుగా భావించి కాల్పులకు పాల్పడ్డారు. అక్కడికక్కడే సుశీల్ ప్రాణాలు కోల్పోయాడు.
ఇక రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దీంతో అసలు కుట్ర బయటపడింది. దీంతో సృష్టి కుమారితో సహా మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సృష్టి కుమారి అనే యువతి తన ఇంటి ఎదురుగా నివసించే ప్రేమ్ పాసితో ప్రేమలో ఉందని పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) హరిమోహన్ శుక్లా తెలిపారు. ఇంతలో సృష్టి వివాహం మరొకరితో నిర్ణయించారని.. అయితే ఈ వివాహాన్ని ఆమె ప్రేమికుడు ప్రేమ్ పాసి అడ్డుకుంటున్నాడని.. బ్లాక్‌మెయిల్‌తో విసిగిపోయిన సృష్టి.. హంతకులను ఏర్పాటు చేసుకుందని చెప్పారు. అయితే ప్రియుడు ప్రేమ్ పాసికి బదులుగా సుశీల్ చనిపోయాడని వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!