Site icon NTV Telugu

Mother kill Child: తల్లివా.. రాక్షసివా..? రెండు నెలల చిన్నారిని కట్టెల పోయిలో వేసి..!

Hyd

Hyd

Mother kill Child: హైదరాబాద్ పరిసర ప్రాంతమైన బౌరంపేట్‌ లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమ్మ ప్రత్యక్ష దైవం అంటారు. అలంటి తల్లి దారుణానానికి వాడి కట్టింది పిల్లాడికి రక్షణగా ఉండాల్సిన తల్లే కసాయిగా మారి తన రెండు నెలల చిన్నారిని అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఏడుస్తున్నాడనే కారణంతో అమానుషంగా చిన్నారిని కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపడం ఇప్పుడు టాప్ టాపిక్ గా మారింది.

భారత్ vs పాకిస్తాన్, భారత్ vs బంగ్లాదేశ్.. T20 World Cup 2026 Womens షెడ్యూల్ విడుదల!

పోలీసుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేంద్ర ఆదివాసీ (21), తన భార్య మమత అహిర్వార్ (20)తో కలిసి బౌరంపేట్‌లోని సనారెల్లి అపార్ట్మెంట్స్ నిర్మాణ ప్రదేశంలో కార్మికులుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ అక్కడే ఏర్పాటు చేసిన క్యాంప్ గదిలో నివసిస్తున్నారు. వీరికి రెండు నెలల బాబు ఉన్నాడు. నేడు (ఫిబ్రవరి 24)న ఉదయం రాజేంద్ర పని నిమిత్తం బయటకు వెళ్లగా, మధ్యాహ్నం తిరిగి వచ్చి చూసే సరికి తన భార్య చిన్నారిని కట్టెల పొయ్యిలో కాల్చుతున్నట్లు గుర్తించాడు. వెంటనే అడ్డుకునే ప్రయత్నం చేసినా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపాడు.

మినీ LED, 108W సౌండ్‌, Quantum డాట్ టెక్నాలజీతో Kodak 65 అంగుళాల IconiK Google TV భారత్‌లో లాంచ్..!

ప్రతిరోజూ బాబు ఏడవడం వల్ల ఇబ్బంది పడుతున్న మమత, ఆ చిన్నారిని చంపాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాబు ఏడవకుండా ఉండేందుకు నోటిలో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి అనంతరం కట్టెల పొయ్యిలో వేసి కాల్చినట్లు సమాచారం. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే దుండిగల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తండ్రి రాజేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలు మమత అహిర్వార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Exit mobile version