Site icon NTV Telugu

Car Accident: కాలువలోకి దూసుకెళ్ళిన స్కార్పియో

Car1

Car1

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక భూపతిపాలెం ప్రాజెక్టులోకి తెల్లవారుజామున ప్రమాదవశాత్తు దూసుకు వెళ్ళిందో స్కార్పియో వాహనం. ఈవాహనంలో సుమారు 350 కేజీల గంజాయి తరలిస్తూ పోలీసులు వెంబడించడంతో నిందితులు పారిపోయే ప్రయత్నంలో ఈఘటన చోటుచేసుకుంది.

విశాఖపట్నం సరిహద్దుల నుంచి మారేడుమిల్లి మీదుగా అక్రమంగా తరలిస్తున్న గంజాయి వాహనాన్ని వెంబడించారు పోలీసులు. భూపతిపాలెం వద్ద జరిగిన ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొనగా, మరొక వ్యక్తి పరారయ్యాడు. ప్రాజెక్టు కాలువలోకి దూసుకెళ్లిన వాహనాన్ని బయటకు తీశారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తుకేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు మారేడుమిల్లి పోలీసులు. ఇటీవలి కాలంలో ఏజెన్సీ నుంచి వచ్చే వాహనాల్లో భారీగా గంజాయి పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ ముఠా వెనుక ఎవరున్నారనేది తేలాల్సి వుంది.గతంలోనూ ఇలాంటి ప్రమాదంలో గంజాయి పట్టుబడింది. కారు పల్టీ కొట్టడంతో అందులో వున్నవారు పారిపోయారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

అనంతపురం జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. ఉరవకొండ శివారు ప్రాంతంలో కళ్యాణ మండపం కాంపౌండ్ లోకి దూసుకెళ్లిన 10 చక్రాల లారీ.ఎవరూ లేకపోవడంతో తప్పింది ప్రమాదం. దీంతో స్థానికులు ఊపిని పీల్చుకున్నారు. గుత్తి పట్టణ శివార్లలో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది ఓ లారీ. ఈ ప్రమాదంలో నలగురికి తీవ్ర గాయాలు అయ్గ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు.

Ganjai In Car: పల్టీ కొట్టిన కారు.. అందులో ఏముందంటే?

Exit mobile version