అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక భూపతిపాలెం ప్రాజెక్టులోకి తెల్లవారుజామున ప్రమాదవశాత్తు దూసుకు వెళ్ళిందో స్కార్పియో వాహనం. ఈవాహనంలో సుమారు 350 కేజీల గంజాయి తరలిస్తూ పోలీసులు వెంబడించడంతో నిందితులు పారిపోయే ప్రయత్నంలో ఈఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నం సరిహద్దుల నుంచి మారేడుమిల్లి మీదుగా అక్రమంగా తరలిస్తున్న గంజాయి వాహనాన్ని వెంబడించారు పోలీసులు. భూపతిపాలెం వద్ద జరిగిన ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొనగా, మరొక వ్యక్తి పరారయ్యాడు. ప్రాజెక్టు కాలువలోకి దూసుకెళ్లిన వాహనాన్ని…