Scene Reconstruction in Apsara Case today: హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో అప్సర హత్య కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే అప్సర హత్యకేసులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి నిందితుడు సాయి కృష్ణ, అప్సర మధ్య పరిచయం ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో తేల్చారు పోలీసులు. బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి తరచూ వాట్సాప్ ద్వారా మెసేజులు చేసుకుని దగ్గరైనట్టు గుర్తించారు. గత ఏడాది నవంబర్లో గుజరాత్ లోని సోమనాథ్, ద్వారక దేవాలయాలను సాయి కృష్ణ , అప్సర కలిసి సందర్శించారు. నవంబర్‌లో గుజరాత్ వెళ్లిన తర్వాత సాయి కృష్ణ, అప్సర మధ్య బంధం మరింత బలపడినట్టు తేలింది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోకపోతే సాయి కృష్ణను రోడ్డుకు ఈడుస్తానని అప్సర బ్లాక్ మెయిల్ చేయడంతో విషయం బయటపడితే తన పరువు పోతుందనే భయంతో ఆమెను సాయి కృష్ణ హతమార్చాడని పోలీసులు దర్యాప్తులో తేల్చారు.
Pushpa 2 Leaked Scene: ఊహించని రీతిలో ఎర్రచందనం స్మగ్లింగ్.. లీక్డ్ సీన్ వైరల్!
మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో వేసి పూడ్చేసి ఏమీ తెలియనట్టు ఆమె కనిపించడం లేదంటూ తానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడే నిందితుడని గుర్తించి అప్సరను అడ్డు తొలగించుకునేందుకు సాయి కృష్ణ హత్య చేశాడని పోలీసులు కేసు కట్టి ఆధారాలు సంపాదించారు. ఈ క్రమంలో తాజాగా నిందితుడు సాయికృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు రెండ్రోజుల కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో శంషాబాద్ పోలీసులు సాయికృష్ణను గురువారం కస్టడీలోకి తీసుకుని తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈరోజు రాత్రి నిందితుడిని హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయించనున్నారని ఈ క్రమంలో అప్సర హత్య ఎలా జరిగింది? అనేది పాయింట్ టు పాయింట్ పరిశీలించనున్నారని తెలుస్తోంది. ఇక శనివారం మధ్యాహ్నంతో సాయికృష్ణ కస్టడీ ముగియనున్న క్రమంలో ఆలోపు తమకు కావాల్సిన వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు.