Site icon NTV Telugu

Police Academy: “పోలీస్ అకాడమీ”లోనే రక్షణ లేదు.. కేరళలో ఘరానా చోరీ..

Kerala Police Academy

Kerala Police Academy

Police Academy: కేరళలో అత్యంత కట్టుదిట్టం భద్రత కలిగిన త్రిస్సూర్ జిల్లాలోని కేరళ పోలీస్ అకాడమీ క్యాంపస్ నుంచి లక్షల విలువ కలిగిన గంధపు చెట్లు దొంగలు దొంగిలించారు. పోలీస్ అకాడమీలోని చెట్లను ఎత్తుకెళ్లిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 30 ఏళ్ల కన్నా పాతవైన గంధపు చెట్ల దొంగతనం జరిగిన కొన్ని రోజులకు తెలిసింది. క్యాంపస్‌లో ఉన్న పోలీస్ సిబ్బందికి ముందుగా ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. అకాడమీ ఎస్టేట్ అధికారి సతీష్ టియు వియ్యూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: Andhra Pradesh Rains: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు..!

త్రిస్సూర్ పోలీస్ అకాడమీ జిల్లాలోనే అత్యంత సురక్షితం ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. సాయుధ పోలీస్ సిబ్బంది క్యాంపస్‌లో రాత్రింతా కాపలా కాస్తారు. ప్రతీ రోజు వందలాది మంది పోలీసుల ఉనికి ఉంటుంది. శిక్షణ పొందుతున్న వారు ఈ క్యాంపస్‌లో ఉంటారు. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం తర్వాత, ఇది కేరళ పోలీసులకు చెందిన అతిపెద్ద శిక్షణా కేంద్రం. ఇది దాదాపుగా 348 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇంత భద్రత ఉన్నప్పటికీ, క్యాంపస్‌లోకి ప్రవేశించి గంధపు చెట్లను దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డిసెంబర్ 27 మరియు జనవరి 2 మధ్య ఈ నేరం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

అకాడమీ క్యాంపస్‌లోని పెద్ద భాగాలు అడవులతో నిండి ఉన్నాయి. ఎస్టేట్‌లో అక్కడక్కడా గంధపు చెట్లు, రోజ్ వుడ్, టేకు చెట్లు ఉన్నాయి. విస్తారంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించడం సవాలుగా ఉందని అధికారులు చెబుతున్నారు. దొంగతనం తర్వాత, అకాడమీ అధికారులు రాత్రి పూట గస్తీని ముమ్మరం చేశారు. బయటి వ్యక్తులు క్యాంపస్ లోకి ప్రవేశించడం, బయటకు వెళ్లడంపై కఠినమైన తనిఖీ చేయాలని ఆదేశించారు.

Exit mobile version