Police Academy: కేరళలో అత్యంత కట్టుదిట్టం భద్రత కలిగిన త్రిస్సూర్ జిల్లాలోని కేరళ పోలీస్ అకాడమీ క్యాంపస్ నుంచి లక్షల విలువ కలిగిన గంధపు చెట్లు దొంగలు దొంగిలించారు. పోలీస్ అకాడమీలోని చెట్లను ఎత్తుకెళ్లిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 30 ఏళ్ల కన్నా పాతవైన గంధపు చెట్ల దొంగతనం జరిగిన కొన్ని రోజులకు తెలిసింది.