Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Sachivalayam Employee Soumya Kidnap Odisha

Kidnap : శ్రీ సౌమ్య.. కశింకోట అనిల్ కుమార్‌ను ప్రేమించిందా..?

Published Date :August 8, 2025 , 10:04 pm
By Gogikar Sai Krishna
  • ప్రేమించి ఉంటే కిడ్నాప్ డ్రామా ఎందుకు ఆడినట్టు?
  • కశింకోట అనిల్ కుమార్‌పై ఉన్న డ్రగ్స్ కేసుల మాటేమిటి?
  • శ్రీ సౌమ్యను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
  • అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి
Kidnap : శ్రీ సౌమ్య.. కశింకోట అనిల్ కుమార్‌ను ప్రేమించిందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kidnap : ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీ సౌమ్య.. కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఒక్క రోజులోనే కేసును ఛేదించారు. కిడ్నాపర్లతోపాటు శ్రీ సౌమ్యను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా శరభవరం సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీసౌమ్య కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. ఆమెతోపాటు ఆమెను ఎత్తుకెళ్లిన నిందితులను కూడా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు..

సోయం శ్రీసౌమ్యను కిడ్నాప్ చేసిన వ్యక్తిని కశింకోట అనిల్ కుమార్‌గా గుర్తించారు. గతంలో నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు గతంలో ఇద్దరూ కలిసి పారిపోయిన సమయంలో అమ్మాయి మైనర్‌గా ఉండేదని.. ఇప్పుడు మేజర్ అయినట్లు వెల్లడించారు. ఐతే అదే వ్యక్తి ఇప్పుడు మళ్లీ కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయినట్లు చెబుతున్నారు ఎస్పీ. పైగా కశింకోట అనిల్ కుమార్ అనే వ్యక్తిపై డ్రగ్స్ కలిగి ఉన్నాడనే నేరంపై NDPS సెక్షన్ కింద కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు..

CM Revanth Reddy : సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌లో వరదనీటి సమస్యకు చెక్‌..!

శరభవరంలోని సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీసౌమ్యను.. గురువారం ఉదయం ఆఫీసు నుంచే కొంత మంది ఎత్తుకెళ్లారు. ఆఫీసుకు వచ్చిన దుండగులు ఇన్నోవా కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారు. అక్కడ కొంత మంది వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐతే చివరకు ఆమె గతంలో ప్రేమించిన వ్యక్తి కశింకోట అనిల్ కుమారే ఆమెను మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి కిడ్నాప్ చేసినట్లు తేలింది…

ఈ కేసులో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు… శరభవరం, మారేడుమిల్లి రవాణా మార్గాల్లోని అన్ని CCTV ఫుటేజ్‌లను పరిశీలించారు. అంతే కాదు ఇన్నోవా వాహనాన్ని గుర్తించేందుకు అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. చివరకు కిడ్నాపర్లను ఒడిశాలోని చిత్రకొండలో పట్టుకున్నారు.. మొత్తానికి కిడ్నాప్ కథ ముగిసింది. కానీ శ్రీ సౌమ్య.. నిజంగానే కశింకోట అనిల్ కుమార్‌ను ప్రేమించిందా? ఒకవేళ ప్రేమించి ఉంటే కిడ్నాప్ డ్రామా ఎందుకు ఆడినట్టు? కశింకోట అనిల్ కుమార్‌పై ఉన్న డ్రగ్స్ కేసుల మాటేమిటి? అతనికి మంచి ఉద్దేశ్యమే ఉంటే.. శ్రీ సౌమ్యను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది..

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Crime
  • anil kumar
  • kidnap
  • Odisha
  • Secretariat Employee

తాజావార్తలు

  • Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు

  • Jr NTR : ఎన్టీఆర్‌ను ఢీ కొట్టేదెవరు?

  • Ishan Kishan: నేను హ్యాపీగా లేను.. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Gold Price Drop: బంగారం కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. పాతాళానికి పడిపోయిన రేట్లు!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions