రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికిక్కడే చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also:Man Escapes Death: ఇతడికి ఇంకా భూమ్మీద నూకలున్నాయి.. పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు..
పూర్తి వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం నిడిగొండ దగ్గర ఆగి ఉన్న ఇసుక లారీని రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికిక్కడే మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలు కావడంతో వారిని జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. చనిపోయిన వారిని దిండిగల్ కు చెందిన పులమాటి ఓం ప్రకాష్, హన్మకొండకు చెందిన నవదీప్ సింగ్ గా గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాధ ఛాయలు అలముకున్నాయి. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..మృతదేహాలను పోస్టు మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.