NTV Telugu Site icon

Fraud: సినిమాల్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి..!

Fraud

Fraud

మోసం చేసేవాడు ఎప్పుడూ కొత్త దారులు వెతుకుతూనే ఉంటాడు.. రకరకాల పేర్లతో కోట్లు కొల్లగొట్టి.. బిచానా ఎత్తేసేవారు ఇప్పుడు ఎంతో మంది తయారయ్యారు.. ఇప్పుడు తాజాగా మరో కొత్త మోసం వెలుగుచూసింది.. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో ఏకంగా రూ. 6 కోట్ల మేరం మోసం చేశారు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వారి బంధువులే టార్గెట్‌గా ఈ మోసానికి పాల్పడ్డారు.. ఇక, మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు కూడా వాడుకున్నారని పోలీసులు చెబుతున్నమాట.. మోసపోయిన బాధితులు న్యాయం చేయాలంటూ సీసీఎస్ ముందు ఆందోళనకు దిగడంతో.. ఈ ఘటన బయటపడింది.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్‌లు మోసాలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.

Read Also: Munugode : ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ భారీ క్యాంపెయిన్.. ఏకంగా 38మంది

ఫిల్మ్ ఇండస్ట్రీ, డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్, బొర్వెల్స్… ఇలా పలు రంగాలలో పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారట… సినిమాల్లో పెట్టుబడులు అంటూ.. బడా సినిమాల పేర్లను కూడా వాడేశారు కేటుగాళ్లు.. ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టోరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది.. ఇలా చాలా సినిమాలలో పెట్టుబడులు పెడతామని నమ్మించారిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వాటిలో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు ఇస్తామని నమ్మించిన చీటర్స్… దాదాపు 30 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వారి బంధువుల నుండి 6 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారట.. ఇక, ఎంతకాలమైనా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో.. అనుమానం వచ్చిన బాధితులు.. డబ్బు కోసం అడగడంతో బెదిరింపులకు పాల్పడి.. దాడి చేశారట.. మంత్రులు, ఎమ్మెల్యే ల పేర్లు చెప్పి.. వారి అనుచరులతో బెదిరింపులకు దిగారు.

మోసాలకు పాల్పడ్డ కొంగర అంజమ్మ చౌదరి, ఆమె కూతురు హేమ, కొడుకు కొంగర సుమంత్, నాగం ఉమా శంకర్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకొని.. న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధితులు.. ఇక, బాధితుల ఆందోళనతో కేసు నమోదు చేసిన సీసీఎస్‌ పోలీసులు.. ఈ కేసులో ప్రధాన సూత్రదారులైన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్‌లను అదువులోకి తీసుకొని విచారిస్తున్నారు.. ఈ కేసులో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు.. అంటే బాధితుల సంఖ్య పెరిగితే.. రూ.6 కోట్ల మోసం.. మరి ఎన్ని కోట్లకు చేరుతుందో చూడాలి.