Fraud: సినిమాల్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోసం చేసేవాడు ఎప్పుడూ కొత్త దారులు వెతుకుతూనే ఉంటాడు.. రకరకాల పేర్లతో కోట్లు కొల్లగొట్టి.. బిచానా ఎత్తేసేవారు ఇప్పుడు ఎంతో మంది తయారయ్యారు.. ఇప్పుడు తాజాగా మరో కొత్త మోసం వెలుగుచూసింది.. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో ఏకంగా రూ. 6 కోట్ల మేరం మోసం చేశారు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వారి బంధువులే టార్గెట్‌గా ఈ మోసానికి పాల్పడ్డారు.. ఇక, మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు కూడా వాడుకున్నారని పోలీసులు చెబుతున్నమాట.. మోసపోయిన బాధితులు న్యాయం చేయాలంటూ సీసీఎస్ ముందు ఆందోళనకు దిగడంతో.. ఈ ఘటన బయటపడింది.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమాశంకర్‌లు మోసాలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు.
Read Also: Munugode : ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ భారీ క్యాంపెయిన్.. ఏకంగా 38మంది
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ఫిల్మ్ ఇండస్ట్రీ, డిస్ట్రిబ్యూషన్, రియల్ ఎస్టేట్, బొర్వెల్స్… ఇలా పలు రంగాలలో పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారట… సినిమాల్లో పెట్టుబడులు అంటూ.. బడా సినిమాల పేర్లను కూడా వాడేశారు కేటుగాళ్లు.. ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టోరీ, నిశ్శబ్దం, వెంకీ మామ, రాక్షసుడు, నాంది.. ఇలా చాలా సినిమాలలో పెట్టుబడులు పెడతామని నమ్మించారిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వాటిలో పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు ఇస్తామని నమ్మించిన చీటర్స్… దాదాపు 30 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వారి బంధువుల నుండి 6 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారట.. ఇక, ఎంతకాలమైనా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో.. అనుమానం వచ్చిన బాధితులు.. డబ్బు కోసం అడగడంతో బెదిరింపులకు పాల్పడి.. దాడి చేశారట.. మంత్రులు, ఎమ్మెల్యే ల పేర్లు చెప్పి.. వారి అనుచరులతో బెదిరింపులకు దిగారు.
మోసాలకు పాల్పడ్డ కొంగర అంజమ్మ చౌదరి, ఆమె కూతురు హేమ, కొడుకు కొంగర సుమంత్, నాగం ఉమా శంకర్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకొని.. న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధితులు.. ఇక, బాధితుల ఆందోళనతో కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు.. ఈ కేసులో ప్రధాన సూత్రదారులైన కొంగర అంజమ్మ చౌదరి, నాగం ఉమా శంకర్‌లను అదువులోకి తీసుకొని విచారిస్తున్నారు.. ఈ కేసులో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు.. అంటే బాధితుల సంఖ్య పెరిగితే.. రూ.6 కోట్ల మోసం.. మరి ఎన్ని కోట్లకు చేరుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!