Robbery Gang Arrest : గత నెల 7వ తేదీన మేడ్చల్ జిల్లాలోని బౌరంపేట్ లో ఓ జ్యువెలర్ షాప్ లో జరిగిన దొంగతనాన్ని ఛేదించి రాజస్థాన్ కు చెందిన ముఠాను అరెస్టు చేసి వారి దగ్గర నుండి సుమారు 15 కిలోల వెండి ఆభరణాలను దుండిగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. బౌరంపేటలోని సోమేశ్వర్ జ్యువెలరీ షాపు పక్కన ఖాళీగా ఉన్న ఒక షట్టర్‌ను గమనించిన దుండగులు పథకం ప్రకారం షట్టర్ ను అద్దెకు తీసుకొని రాత్రి పక్క దుకాణంలోకి రంధ్రం చేసి దుకాణం నుండి దాదాపు 15 కిలోల వెండిని దొంగిలించారు..
ఉదయం షాపుకు వచ్చి చూసిన యజమాని షాపు గోడ పగలకొట్టి ఉండటం.. షాపులో ఉన్న దాదాపు 18 కిలోల వెండి కనిపించకుండా పోవడంతో దొంగతనం జరిగిందని గ్రహించి బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీబీ విజ్యువల్స్ ఆధారంగా నిందితులు రాజస్థాన్ కు చెందిన చేతన్ ప్రకాష్ రియా, సిరాజుద్దీన్ ,కాలుకాగా కాలురాం లు గా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.. పోలీసుల విచారణలో 6 నిందితులు దొంగతనంలో పాల్గొన్నట్లుగా గుర్తించి బెంగళూర్ లో విక్రయించిన 3.5 కేజీల వెండి ఆభరణాలతో పాటు మొత్తం 15 కిలోల వెండి వస్తువులు, బొల్లెరో వాహనం, దాదాపు 4 అడుగుల ఇనుప రాడ్ ను స్వాధీనం చేసుకున్నారు..
పరారీ లో ఉన్న మరో ముగ్గురు అల్ నాథూరాం, మహేందర్, జై తరుణ్ గోవింద్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.. నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లు డీసీపీ పురుషోత్తం తెలిపారు.. అద్దెదారునికి అద్దె ఇచ్చే ముందు, భవిష్యత్తులో ఎలాంటి నేరాలు జరగకుండా ఉండటానికి ముందుగా అద్దెదారు నుండి పత్రాలను సేకరించి, అతని స్వస్థలం ధృవీకరించుకోవాలని అడిషనల్ DCP అన్నారు.
CM Revanth Reddy : వారికి తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయండి..
