Site icon NTV Telugu

PUBG Love Affair : ’55 ముక్కలుగా నరుకుతా”.. భర్తను బెదిరించిన ప్రేమలో మునిగిన భార్య

Pubg

Pubg

Shocking : ఇది పబ్‌జీ ప్రేమ కథ కాదు.. పరస్పర నమ్మకాలను తాకే సోషల్ మీడియా రిలేషన్‌షిప్ హెచ్చరికగా మారిన ఘటన. ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు నేషనల్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమ కోసం ఓ మహిళ తన కుటుంబాన్ని వదిలేసింది. మరోవైపు, ఆన్‌లైన్‌ పరిచయాన్ని నిజ జీవిత బంధంగా మలచేందుకు యువకుడు వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. బాంద్ జిల్లాకు చెందిన ఆరాధన అనే మహిళ 2022లో శీలు అనే యువకుడిని వివాహం చేసుకుంది. వీరికి ఏడాదిన్నర వయసున్న ఓ కుమారుడూ ఉన్నాడు. అయితే గేమింగ్‌కు ఆకర్షితురాలైన ఆరాధన, ఇంట్లో ఉండగానే PUBG గేమ్‌ ఆడటం ప్రారంభించింది. అదే సమయంలో లూధియానాకు చెందిన శివమ్‌ అనే వ్యక్తితో పబ్‌జీలో పరిచయం ఏర్పడింది. ఆటలో మొదలైన పరిచయం ప్రేమగా మారింది.

Jupally Krishan Rao : తలతిక్క పనులు చేశారు కాబట్టే బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించారు

ఆరాధన తన భర్త చేత కొట్టించుకుంటానని శివమ్‌కు చెబుతూ ఉండేదట. దీన్ని గమనించిన శివమ్, ఆమె కోసం పంజాబ్‌ నుంచి మహోబా వరకు దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. ఊహించని అతిథిగా వచ్చిన అతడిని చూసి ఆరాధన భర్తతోపాటు కుటుంబం షాక్‌కు గురైంది. అతని రాకతో వారి ఇంట్లో గందరగోళం ఏర్పడింది. ఈ ప్రేమ కథలో మరొక ఘోర ట్విస్ట్ కూడా ఉంది. భర్త తమ ప్రేమకు అడ్డుగా నిలుస్తున్నాడని భావించిన ఆరాధన, అతడిని ‘మీరట్ మర్డర్’ తరహాలో 55 ముక్కలుగా నరుకుతానని బెదరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బెదిరింపుతో భయపడిన భర్త శివమ్‌ను పట్టించి పోలీసులకు అప్పగించాడు.

Prashant Kishor: హీటెక్కుతున్న బీహార్ పాలిటిక్స్.. రాహుల్‌గాంధీకి సవాల్ విసిరిన ప్రశాంత్ కిషోర్

శివమ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా, ఆరాధన కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తన భర్త తాగుబోతు, వేధింపుల వాడు అని ఆరోపిస్తూ… శివమ్‌తోనే వెళ్లిపోతానని వాదించింది. పోలీసులు కేసు నమోదు చేసి శివమ్‌ను 151 సెక్షన్ కింద కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటనతో, వాస్తవ ప్రపంచం ఎంత సంక్లిష్టంగా మారిందో స్పష్టమవుతోంది. టెక్నాలజీ పరిచయాల నేపధ్యంలో బంధాలు ఎలా రూపాంతరం చెందుతున్నాయన్నదానికి ఇది ఘాటు ఉదాహరణ.

Exit mobile version