Preethi Family Members On Case: కేసు విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని ప్రీతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని బాంబ్ పేల్చారు. ఈ కేసులో సైఫ్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ప్రీతి కుటుంబం.. వారందరినీ విచారించాల్సిందిగా కోరారు. హైదరాబాద్ డీజీపీ ఆఫీస్‌కి వెళ్లిన ప్రీతి కుటుంబం.. అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్‌ని కలిసి వినతి పత్రం అందించారు. ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసి, నిందితులను శిక్షించాలని కోరామన్నారు. కేఎంసీ హెచ్ఓడీ నాగార్జున రెడ్డిని ట్రాన్స్ఫర్ చేయడం కాదు, పూర్తిగా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగింది ఆపరేషన్ థియేటర్‌లో కాబట్టి.. ఆ సమయంలో అక్కడున్న వారందరినీ విచారించాలన్నారు. టాక్సీకాలజీ రిపోర్ట్ ఇంకా రాలేదని పోలీసులు చెబుతున్నారని తెలిపారు.
DK Aruna: ప్రీతి కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు.. నిజానిజాలు బయటకు రావాలి
ఈ సందర్భంగా ప్రీతి బ్రదర్ పృథ్వీ మాట్లాడుతూ.. తన అక్కకు న్యాయం జరిగేవరకు పోరాడుతానన్నాడు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ క్లియర్‌గా ఉన్నా.. మెడికల్ ఇన్వెస్టిగేషన్ మాత్రం పక్క దారి పట్టిస్తున్నారని ఆరోపించాడు. పోస్టుమార్టం రిపోర్ట్ కూడా మ్యానిపులేట్ చేస్తారని వ్యాఖ్యానించాడు. ఘటన జరిగిన రోజే బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేస్తే, కరెక్ట్ రిజల్ట్స్ వచ్చేవని తెలిపాడు. ఘటన జరిగిన రోజు ఏమైందో క్లియర్‌గా చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ నుంచి బాడీని తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేశారని.. అసలు తమ అక్కకి ఏం ట్రీట్మెంట్ చేశారో, సర్జరీ ఎందుకు చేశారో చెప్పాలని కోరాడు. అనంతరం ప్రీతి సిస్టర్ మాట్లాడుతూ.. కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి, తమకు న్యాయం చేయాలని వేడుకుంది. న్యాయం జరిగేంతవరకు తాము పోరాడుతామని తెలిపింది. రిపోర్ట్స్ అన్నీ తారుమారు అయ్యాయని, ఇప్పటివరకు తమకు ఎలాంటి రిపోర్ట్స్ అందలేదని, దర్యాప్తు ఎలా సాగుతుందో తమకు తెలియదని పేర్కొంది.
MLC Kavitha: మహిళలు వంట గదిలోనే ఉండాలన్న రోజులు పోవాలి
ఇదే సమయంలో ప్రీతి తల్లి శారద మాట్లాడుతూ.. ప్రీతి కేసు విషయంలో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం వెలిబుచ్చారు. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నానని కోరారు. ఇప్పటివరకు తమకు ఎలాంటి రిపోర్ట్ రాలేదన్నారు. దర్యాప్తు ఎటువైపు సాగుతుందో తెలియడం లేదని, న్యాయం జరిగేవరకు పోరాడుతామని తెలిపారు. మరోవైపు.. ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌లో విష పదార్థాలు డిటెక్ట్ కాలేదని వెల్లడైంది. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని.. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లో ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్ తేల్చింది. దీంతో.. ఈ ఆత్మహత్యాయత్నం కేసుని ఆత్మహత్యాయత్నం కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చేందుకు పోలీసులు యోచిస్తున్నారు.