Snoring: గట్టిగా “గురక” పెడుతున్నాడని వ్యక్తి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snoring: బిగ్గరగా “గురక” పెట్టడం అతని ప్రాణాలను తీసింది. ఇరుగుపొరుగు ఇళ్లలో ఉంటున్న వ్యక్తుల మధ్య గురక వివాదం ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన అమెరికా పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 55 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకి పాల్పడినందుకు థర్డ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపబడ్డాయి.
Read Also: Asaduddin Owaisi: ముస్లింల నుంచి క్రమపద్ధతిలో బాబ్రీ మసీదుని లాక్కున్నారు..
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
62 ఏళ్ల రాబర్ట్ వాలెస్, క్రిస్టోఫర్ కేసీ(55) ఇరుగుపొరుగు ఇళ్లలో ఉంటున్నారు. అయితే వాలెస్ గురకపై పలుమార్లు కేసీ ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఈ వివాదంపై ఇరువురి మధ్య తీవ్రవివాదం చోటు చేసుకుంది. జనవరి 15న కేసీ, వాలెస్‌ని కత్తితో పొడిచాడు. కత్తిపోట్లకు సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు స్పందించారు. అప్పర్ మోర్‌ల్యాండ్ టౌన్‌షిప్‌లో కేసీ ఇంటి సమీపంలో వాలెస్ తీవ్రగాయాలతో కనిపించాడు. దాడి చేస్తున్న సమయంలో కేసీకి కూడా గాయాలయ్యాయి. వీరిద్దర్ని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స సమయంలోనే వాలెస్ మరణించాడు. జనవరి 18న కేసీని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి ఇంటి ముందు కత్తి, రక్తపు మరకల్ని పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ వాలెస్ మరణానికి కారణం అనేక కత్తిపోట్లు అని నిర్ధారించిన తర్వాత, కేసీని గురువారం అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!