Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder Case: ఒడిశాలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. బొలాంగీర్ జిల్లాలోని దేవ్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బగ్దా గ్రామంలో 40 ఏళ్ల వ్యక్తిని హత్య చేసి, తలను మొండెం నుంచి వేరు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు శత్రుఘ్న సాహూతో పాటు మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడిని తుసురా పోలీస్ స్టేషన్ పరిధిలోని తెబడముండా గ్రామానికి చెందిన సంతోష్ ఖార్సెల్గా గుర్తించారు.
భోజనానికి పిలిచి దారుణ హత్య:
బొలాంగీర్ ఎస్పీ జీ. అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు శత్రుఘ్న సాహూ ఆగస్టు 18న సంతోష్‌ను భోజనం చేసేందుకు తన ఇంటికి పిలిచారు. సంతోష్ నిద్రపోయిన తర్వాత సాహూ, అతడి సహచరులు కలిసి అతడిపై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం పదునైన ఆయుధంతో సంతోష్ తలను మొండెం నుంచి వేరు చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం సంతోష్ మృతదేహాన్ని గ్రామం వెలుపలికి తీసుకెళ్లి ఓ చెరువులో పడేశారు. అయితే తెగిపోయిన తలను మాత్రం సాహూ ఇంట్లోని పూజా గదిలో దాచినట్లు పోలీసులు గుర్తించారు. గురువారం స్థానికులు చెరువు వద్ద తల లేని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Also Read
- Myanmar Airstrike: బౌద్ధ మఠంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 14 మంది మృతి
- Karnataka: కర్ణాటకలో దారుణం.. యువతి కిడ్నాప్, అత్యాచారం, హత్య..
- Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
- Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
చిక్కిన నిందితుడు:
దర్యాప్తులో భాగంగా సంతోష్ చివరిసారిగా శత్రుఘ్న సాహూతో కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సాహూ ఇంటికి వెళ్లి విచారించారు. ఆ సమయంలో సాహూ ఇంట్లో ధ్యానం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత మద్యం సేవించే విషయంలో జరిగిన గొడవ కారణంగానే సంతోష్‌ను హత్య చేసినట్లు సాహూ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే మరింత లోతుగా విచారించగా.. సంతోష్ తెగిపోయిన తలను పూజా గదిలో దాచినట్లు అతడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు చూపించిన ప్రదేశంలో పోలీసులు తవ్వకాలు చేపట్టి సంతోష్ తలను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన రక్తంతో తడిసిన పదునైన ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంత్రాల కోసమే హత్య?
ఈ హత్య వెనుక మూఢనమ్మకాలు, తంత్ర-మంత్రాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనకు దూరమైన భార్యను తిరిగి తన వద్దకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే సాహూ ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. సాహూ భార్య గత సుమారు పదేళ్లుగా తన కుమారుడు, కుమార్తెతో కలిసి అతడికి దూరంగా ఉంటోంది. భార్యను తిరిగి తన వద్దకు రప్పించుకోవాలనే నమ్మకంతో సాహూ నరబలికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య పథకాన్ని సాహూ ఒక్కడే రూపొందించాడా? లేక మరికొందరి సహకారం ఉందా? అనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. సాహూ తల్లి, సోదరుడు, వదినను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రధాన నిందితుడు విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ అభిలాష్ తెలిపారు. నిందితుడి ఇంటి నుంచి మృతుడి తలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించిన పోలీసులు.. హత్య జరిగిన తీరును తెలుసుకునేందుకు క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేపట్టారు.
తాజావార్తలు
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
-
HYDRAA : మురుగు చెరువు నుంచి టూరిజం స్పాట్.. సున్నం చెరువు సరికొత్త లుక్.!
-
150 Words on One Sticky Note: ఒకే స్టిక్కీ నోట్‌పై 150 పదాలు.. భారత సంతతి క్లౌడ్ ఇంజనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!
-
AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
-
England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?